Upendra UI teaser: టీజర్ తోనే హైప్ పెంచేసిన ఉపేంద్ర..ఇక దరువే..!

కన్నడ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న డైరెక్టర్ , హీరో ఉపేంద్ర అందరికీ సుపరిచితుడే.. ఇప్పుడు తాజాగా UI అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.. గత ఏడాది సెప్టెంబర్ లో ఈ చిత్రానికి సంబంధించి ఒక పోస్టర్ ను ఇంటర్నేషనల్ లెవెల్ లో విడుదల చేయగా.. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ టీజర్ ని విడుదల చేయడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి..

ఉపేంద్ర UI టీజర్ తో సరికొత్త ప్రపంచానికి తీసుకువెళ్లాడు. ఉపేంద్ర నటించి, డైరెక్షన్ చేసిన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా టీజర్.. UI టీజర్ తో కాదు యు ఐ వరల్డ్ అనే ఒక బ్యాగ్రౌండ్ స్కోప్ తో ఈ సినిమా వాయిస్ టీజర్ మొదలవుతుంది. దాదాపుగా రెండు నిమిషాల నిడివి తో ఉన్న ఈ టీజర్.. ఊహించని విజువల్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది.. ఇందులో స్పెషల్ ఎఫెక్ట్స్, స్టంట్స్ చివరిలో ఉపేంద్ర కూడా సరికొత్తగా ప్రేక్షకులకు కనిపిస్తున్నారు.

ఈ రోజున మేకర్స్ ఈ టీజర్ ని సోషల్ మీడియా ద్వారా అభిమానుల ముందుకు తీసుకువచ్చారు.. ఈ టీజర్ పోస్టుకు వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ UI అనే క్యాప్షన్ తో.. ఉపేంద్ర కూడా ఈ టీజర్ ని పోస్ట్ చేశారు.. అయితే ఈ సినిమా స్టోరీ ఏంటనే విషయం మాత్రం ఇంకా రివీల్ చేయలేదు.. ఇందులో నటించిన ప్రతి ఒక్కరు కూడా చాలా విభిన్నమైన గెటప్ లలో కనిపిస్తున్నారు.. కానీ టీజర్ చివరిలో వాళ్లని ఆదుకోవడానికి గుర్రం పైన ఉపేంద్ర ఎంట్రీ ఇచ్చే సీన్ హైలెట్ గా కనిపిస్తోంది..

- Advertisement -

గతంలో 2015 వ సంవత్సరంలో ఉప్పి-2 చిత్రం తర్వాత ఉపేంద్ర మరొకసారి దర్శకత్వం ఈ చిత్రానికే వహిస్తున్నారు. అతని కెరియర్లో దర్శకత్వం వహించిన 11వ సినిమాగా UI చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దాదాపుగా రూ .100 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.. ఈ సినిమా కోసం ఉపేంద్ర ఇండస్ట్రియల్ లైట్ అండ్ మ్యూజిక్ క్రియేషన్స్ సరికొత్త టెక్నాలజీని ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో 90% గ్రాఫిక్స్ ఉంటాయని కూడా తెలియజేశారు. ఉపేంద్ర తో రీష్మా , సన్నీలియోన్, నిధి సుబ్బయ్య , ఇంద్రజిత్ లంకేష్, మురళి శర్మ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి రిలీజ్ డేట్ ను మాత్రం ప్రకటించలేదు. ఇకపోతే టీజర్ తోనే హైప్ పెంచేసిన ఉపేంద్ర.. ఇక సినిమాతో దరువు సృష్టించబోతున్నారని చెప్పవచ్చు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు