Animal : షూటింగ్ లేనప్పుడు రష్మిక ఎక్కడికి వెళ్తుందో తెలుసా?

“పుష్ప” సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ అందుకున్న బ్యూటీ రష్మిక మందన్న. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సక్సెస్ లతో దూసుకెళ్తోంది. భాషతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ తన కెరీర్లో పీక్ స్టేజ్ ని ఎంజాయ్ చేస్తోంది. నేషనల్ క్రష్ గా తన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ఈ అమ్మడు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రష్మిక మందన్న నటిస్తున్న తాజా చిత్రం “యానిమల్”.

బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. డిసెంబర్ 1న రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు ఫుల్ స్పీడ్ తో జరుగుతున్నాయి. అందులో భాగంగానే తాజాగా “యానిమల్” టీం “ఆహా”లో స్ట్రీమింగ్ అవుతున్న పాపులర్ షో “అన్ స్టాపబుల్”కు హాజరయ్యారు. బాలయ్య హోస్ట్ చేస్తున్న ఈ కార్యక్రమంలో రష్మిక మందన్న, రణబీర్ కపూర్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సందడి చేశారు. ఈ షోలో పలు ఆసక్తికర విషయాలను చర్చించారు. అంతేకాదు రష్మిక, విజయ్ దేవరకొండకు సంబంధించిన పలు ఇంటరెస్టింగ్ టాపిక్ ను కూడా తెర మీదకు తీసుకొచ్చాడు బాలయ్య. ప్రస్తుతం ఈ షోకు సంబందించిన విషయాలపై నెట్టింట్లో చర్చ నడుస్తోంది.

కాగా ఈ షోలో భాగంగానే బాలయ్య “యానిమల్” హీరో రణబీర్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగాలను రష్మికకు సంబంధించిన ప్రశ్నలు అడిగాడు. షూటింగ్ లేనప్పుడు రష్మికను కలవాలంటే ఎక్కడికి వెళ్లాలి? అసలు షూటింగ్ లేకపోతే రష్మిక ఏం చేస్తుంది? అని అడిగాడు బాలయ్య. ఈ ప్రశ్నకు ఇద్దరూ ఒకే సమాధానం చెప్పారు.

- Advertisement -

రష్మిక దాదాపుగా సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతుందని, ఒకవేళ ఆమెకు షూటింగ్ లేకపోతే, ఖాళీ సమయం దొరికితే మాత్రం ఖచ్చితంగా జిమ్ లోనే ఉంటుందని, అక్కడికి వెళ్తేనే ఆమె దొరుకుతుందని చెప్పుకొచ్చారు. దీంతో ఫిట్నెస్ గురించి రష్మిక తీసుకుంటున్న శ్రద్ధ ఏంటో అందరికీ తెలిసింది. అందుకే ఈ బ్యూటీ రోజురోజుకూ ఇంత ఫిట్ గా, అందంగా తయారవుతోంది. ఇక రష్మిక కెరీర్ విషయానికొస్తే… ‘యానిమల్’ మూవీ రిలీజ్ కు రెడీ గా ఉందన్న విషయం తెలిసిందే. మరోవైపు “పుష్ప 2” కూడా చేస్తోంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే ఇప్పుడున్న హీరోయిన్లలో రష్మికనే టాప్ హీరోయిన్ అవుతుంది. ఇవి మాత్రమే కాకుండా రష్మిక చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయి. తెలుగులో ఓ సినిమా చేస్తోంది. అలాగే హిందీలో ఓ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Get the latest celebrity news updates, Bollywood movie updates, and the latest news in Tollywood here at Filmify. Also, grab Filmify for the latest movie release dates & Tollywood gossip news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు