SandeepReddyVanga: ‘అనిమల్’ ని మించిన ఓ రేంజ్ సినిమా మెగాస్టార్ ఎప్పుడో చేసేసాడని తెలుసా?

టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తాజాగా తీసిన “అనిమల్” సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత ఏడాది కాలంగా ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ట్రెండ్ అయి కూర్చుంటుంది. గ్లిమ్ప్స్ తోనే అంచనాలు పెంచేసిన ఈ సినిమా, ఆ తర్వాత రిలీజ్ అయిన టీజర్, లేటెస్ట్ గా ట్రైలర్ తో సినిమా పై ఉన్న అంచనాల్ని పదింతలు చేసింది. ఇక డిసెంబర్ 1న రిలీజ్ కాబోతున్న అనిమల్ మూవీ ట్రైలర్ లోనే రణబీర్ కపూర్ పెర్ఫార్మన్స్ కి సందీప్ వంగ స్టైల్ అఫ్ మేకింగ్ కి ఫిదా అయిపోయారు ఫ్యాన్స్.

అయితే 37 ఏళ్ళ కిందటే టాలీవుడ్ లో అనిమల్ ని మించిన ఓ రేంజ్ సినిమా మెగాస్టార్ చిరంజీవి చేసాడని తెలుసా? అప్పట్లోనే ఈ జెనరేషన్ కి కావాల్సినంత స్టఫ్ మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమాలో ఇచ్చేసాడు. ఆ సినిమాయే కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో వచ్చిన “కిరాతకుడు”. టైటిల్ కూడా “అనిమల్” ని మించి ఉందని మీకిప్పటికే అర్ధమై ఉంటుంది. అయితే స్క్రీన్ ప్లే నేపథ్యం వేరైనప్పటికీ కథ విషయంలో అనిమల్, కిరాతకుడు ఒకేలా ఉంటాయి.

అనిమల్ కథ విషయానికి వస్తే ఈ సినిమాలో హీరో ఓ రిచ్ ఫ్యామిలి కి చెందిన వాడు, కాగా తండ్రి అంటే చాలా ఇష్టం. కానీ హీరో నాన్న రూల్స్ పేరుతో చిన్నప్పట్నుంచి పనిష్ చేస్తూ ఉంటాడు. కొడుకు ఏం చేసినా నచ్చదు, ఎంకరేజ్మెంట్ ఉండదు. చివరికి కొడుకు ప్రేమ పెళ్లిని కూడా ఒప్పుకోడు. అందుకే ఫ్యామిలీ నుండి దూరమవుతాడు. బయటి ప్రపంచం లో పెద్ద డాన్ అవుతాడు. తీరా తండ్రికి ఆపద వచ్చేసరికి తిరిగి వచ్చి, ఆయన్ని చంపాలని చూసిన వాళ్లపై ప్రతీకారం తీర్చుకుంటాడు.

- Advertisement -

ఇక కిరాతకుడు కథలో కూడా చిరంజీవి రిచ్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కాగా, చిన్నప్పుడే తల్లిని కోల్పోగా, తండ్రి ప్రేమ కోసం ఆరాటపడుతూ ఉంటాడు. ఈ సినిమాలో కూడా తండ్రి రూల్స్ పేరుతో, బిజీ పేరుతో చిన్నపట్నుంచి దూరంగా పెంచుతాడు. ఆ కారణంగా హీరో తండ్రి ప్రేమకు నోచుకోలేక సొసైటీ కి దూరంగా వెళ్ళిపోతాడు. అక్కడ హీరో అనుకోని చిక్కుల్లో పడతాడు. దానివల్ల తండ్రికి మరింత దూరమవుతాడు. ఇక అప్పుడు తండ్రికి ఆపద వచ్చిందని తెలిసి, ఎన్నో సాహసాలు చేసి తండ్రిని కాపాడుకొని, దేశాన్ని కూడా కొన్ని పరిస్థితుల నుండి కాపాడతాడు.

ఒక రకంగా ‘కిరాతకుడు’ స్టోరీ చెప్పడం కన్నా, చూస్తే చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్. అయితే అప్పటి జనరేషన్ కి సినిమా అర్ధం కాక అంతగా ఆడలేదు. కానీ టీవిల్లో ఎప్పుడేసినా ఇరగదీస్తోంది సినిమా. సందీప్ రెడ్డి వంగ కిరాతకుడు సినిమా స్టోరీనే తన స్టైల్ లో ఛేంజ్ చేసి తీసాడని కొందరు ట్రేడ్ విమర్శకులు భావిస్తున్నారు. మరి దీనిపై డైరెక్టర్ సందీప్ క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఇక అనిమల్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక, స్టోరీ ని ఇమ్యాజిన్ చేసుకున్న మెగా ఫ్యాన్స్ చిరు కిరాతకుడు సినిమా రీల్స్ ని ఇన్స్టా లో సోషల్ మీడియా లో ట్రెండ్ చేస్తున్నారు.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు