Prabhas: ఆ హీరో రిజెక్ట్ చేసిన స్టోరీకి ప్రభాస్ ఓకే అన్నాడా..? 

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో స్ట్రాంగ్ లైనప్ తో బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది, జూన్ 16న ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే  సినిమాలతో పాటు డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో కూడా ప్రభాస్ ఒక సినిమా చేయనున్నాడు. హారర్ బ్యాక్డ్రాప్ లో రూపొందనున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ ఈ సినిమా కథ హారర్ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాకి ‘రాజా డీలక్స్’ అన్న టైటిల్ పరిశీలనలో ఉందని టాక్ వినిపిస్తోంది.

అయితే, దర్శకుడు మారుతి గతంలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ని హారర్ జానర్లో సినిమా చేయమని కోరగా, తేజ్ తనకు దెయ్యాలంటే భయమని ఈ కథ వద్దని అన్నాడట, దీంతో ఆ కథ పక్కన పెట్టి ప్రతిరోజూ పండగే కథ సిద్ధం చేసినట్లు విరూపాక్ష సక్సెస్ మీట్లో పాల్గొన్న మారుతి చెప్పుకొచ్చారు. అసలు హారర్ జానర్ సినిమాయే చేయనన్న తేజ్ ని ఒప్పించి ఈ సినిమా చేసినందుకు దర్శకుడు కార్తీక్ కి అభినందనలు తెలిపాడు మారుతి.

ఈ నేపథ్యంలో తేజ్ గనక అప్పట్లోనే హారర్ జానర్ కి ఓకే చెప్పి ఉంటే దర్శకుడు మారుతి తేజ్ తోనే రాజా డీలక్స్ సినిమా చేసి ఉండేవాడని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా కెరీర్లో తొలిసారి హారర్ జానర్లో విరూపాక్ష సినిమా చేసిన తేజ్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ప్రభాస్ లైనప్ లో ఆదిపురుష్ మినహా అన్ని సినిమాలు యాక్షన్ బ్యాక్డ్రాప్ ఉన్న సినిమాలే కావటం వల్ల మారుతితో చేయబోయే హారర్ జానర్ సినిమా రిఫ్రెషింగ్ గా ఉంటుందని అంటున్నారు. కెరీర్లో ఫస్ట్ టైమ్ ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా చేయనున్న మారుతి రాజా డీలక్స్ ని ఏ రకంగా డీల్ చేస్తాడో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు