Pooja Hegde: బుట్ట బొమ్మకి కలిసి రాని బాలీవుడ్..!

పూజ హెగ్డే, ఒకలైలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై అనతి కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశం పొంది టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. వరుస హిట్స్ తో దూసుకెళ్లిన పూజ ప్రస్తుతం వరుస ఫ్లాప్స్ తో సతమతం అవుతోంది. తెలుగులో అల వైకుంఠపురం సినిమా తర్వాత చెప్పుకోదగ్గ హిట్ లేని పూజ బాలీవుడ్ కి మకాం మార్చింది. అయినప్పటికీ ఫలితం దక్కలేదు, ఎన్నో అంచనాలు పెట్టుకున్న సర్కస్ సినిమా డిజాస్టర్ అవటంతో పూజ లిస్ట్ లో మరో ఫ్లాప్ వచ్చి చేరింది. తాజాగా పూజ, సల్మాన్ ఖాన్ జంటగా నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూజ కెరీర్ కి హిట్ కీలకం అయిన దశలో వచ్చిన ఈ సినిమా కూడా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయింది. దీంతో పూజ లిస్ట్ లో ఆరో ఫ్లాప్ వచ్చి చేరింది.

కెరీర్ మొదలైన నాటి నుండి కమర్షియల్ హీరోయిన్ పాత్రలకే పరిమితం అయ్యింది తప్ప నటనకు ప్రాధాన్యం ఉన్న రోల్స్ చేయలేదు పూజ హెగ్డే. అరవింద సమేత సినిమాలో ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ దక్కినప్పటికీ ఆ పాత్రలో అంతగా మెప్పించలేకపోయింది బుట్ట బొమ్మ. ఆ తర్వాత అల వైకుంఠ పురం బ్లాక్ బస్టర్ అయినప్పటికీ అందులో పూజ అందానికి తప్ప అభినయానికి స్కోప్ లేకపోవటం వల్ల కెరీర్ కి పెద్దగా హెల్ప్ అవ్వలేదు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో ఛాన్స్ వచ్చినప్పటికీ అది ఒక్క సాంగ్ కోసం రాసిన క్యారెక్టర్ లా ఉండటం వల్ల ఉపయోగం ఏమీ లేకపోయింది. రాధేశ్యామ్ లాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా కూడా డిజాస్టర్ అవ్వటం పూజ కెరీర్ కి పెద్ద మైనస్ అయ్యింది. ప్రస్తుతం త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమాలో నటిస్తున్న పూజ హెగ్డే కి ఈ సినిమా అయినా హిట్ అయ్యి తన కెరీర్ ని గాడిలో పెడుతుందో లేదో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు