Unstoppable : బావా గారు వస్తున్నారండోయ్

సినిమాలతోనే కాకుండా హోస్ట్ గా తనలోని మరో టాలెంట్ ను బయట పెడుతూ.. దిగ్విజయంగా ముందుకు సాగుతున్నారు హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ. “అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె” టాక్ షో ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఓటిటి ” ఆహా” వేదికగా స్ట్రీమింగ్ కాబడిన ఈ కార్యక్రమం.. తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. దీంతో ఇప్పుడు సీజన్ 2 కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 4వ తేదీన అధికారికంగా ఈ షోని ప్రకటించబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రోమో విడుదలైంది.

ఈ షో కి సంబంధించిన ముఖ్యమైన తేదీని అక్టోబర్ 4వ తారీఖున ఏర్పాటు చేయబోతున్న మీడియా సమావేశంలో ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండవ సీజన్ కి సంబంధించి ఓ స్పెషల్ సాంగ్ కూడా ఇప్పటికే విడుదలైంది. రోల్స్ రైడా రాసి, పాడిన ర్యాప్ పాటను తాజాగా విడుదల చేశారు. ఇదిలా ఉంటే.. మొదటి సీజన్ లో అందరూ కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వారే వచ్చారు. అయితే రెండవ సీజన్ లో రాజకీయ నాయకులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులను కూడా బాలకృష్ణ ముందు హాట్ సీట్ లో కూర్చోబోతున్నట్లు సమాచారం.

ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ షోలో పాల్గొనబోతున్నట్లు జోరుగా వార్తలు సాగుతున్నాయి. వరసకి బావా, బామ్మర్ది అయిన బాలకృష్ణ – చంద్రబాబు మధ్య మాటలు ఎలా ఉంటాయో అంటూ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ.. వీరిద్దరూ కలిసి ఈ షోలో సందడి చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు