Business Man Rerelease: డామినేట్ చేస్తున్న రీరిలీజ్ సినిమాలు..!

Business Man Rerelease

టాలీవుడ్లో ప్రస్తుతం రీరిలీజ్ ల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలు రీరిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కొల్లగొట్టిన నేపథ్యంలో తాజాగా మరో రెండు సినిమాలు రీరిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. గౌతమ్ మీనన్ డైరెక్షన్లో సూర్య, సమీరా రెడ్డి జంటగా నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ ఆగస్టు 4న రిలీజ్ అవుతుండగా, పూరి జగన్నాధ్ డైరెక్షన్లో మహేష్ బాబు, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన బిజినెస్ మాన్ సినిమా మహేష్ బాబు బర్త్ డే సందర్బంగా ఆగస్టు 9న రిలీజ్ కానుంది. రెండు సినిమాలకు ఇప్పటికి మంచి ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో రీరిలీజ్ కి క్రేజ్ ఉండటం సహజమే, అయితే, న్యూ రిలీజ్ సినిమాలను కూడా డామినేట్ చేసే రేంజ్ లో వీటికి అడ్వాన్స్ బుకింగ్స్ ఉండటం ఆశ్చర్యాన్ని కలిసాగిస్తోంది.

ఈ శుక్రవారం ధోని ప్రొడక్షన్స్ లో వస్తున్న ఫస్ట్ సినిమా లెట్స్ గెట్ మ్యారీడ్ ( LGM ), రాజుగారి కోడి పలావ్ వంటి చిన్న సినిమాలు రిలీజ్ ఉన్నప్పటికీ బుకింగ్స్ పరంగా అవి నామమాత్రపు ప్రభావం కూడా చూపలేకపోతున్నాయి. ఈ క్రమంలో కంటెంట్ కి ఉన్న వాల్యూ ఈ సినిమాల ద్వారా మల్లి ప్రూవ్ అయ్యిందని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.

ఒక పక్క థియేటర్స్ లో బేబీ, బ్రో సినిమాలు ఉన్నప్పటికీ రీరిలీజ్ సినిమాలకు ఈ రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఉండటం విశేషమని చెప్పాలి. బుకింగ్స్ తోనే ఇంత సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ రీరిలీజ్ సినిమాలు రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో హంగామా చేస్తాయో అన్న ఆసక్తి నెలకొంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు