Bimbisara : ఓటీటీ డేట్ ఫిక్స్

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం బింబిసార. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ అయింది. విడుదలైన తొలి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందులో కళ్యాణ్ రామ్ సరికొత్త లుక్ లో కనిపించాడు. బింబిసార అనే రాజుగా తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే ది బెస్ట్ ఫర్మామెన్స్ ఇచ్చాడని సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

టైం ట్రావెల్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై ఆసక్తి నెలకొంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సోషియో ఫాంటసీ మూవీ కోసం పలు ఓటీటీ సంస్థలు గట్టిగానే పోటీ పడ్డాయట. చివరకు బింబిసారను ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ జీ5 భారీ ఒప్పందానికి సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ అనంతరం 8 వారాలు గడిచిన తర్వాతే ఓటీటీకీ వస్తుందని అంటున్నారు. అంటే ఈ మూవీ అక్టోబర్ నెలలో మొదటి వారం లేదా రెండో వారంలో ఓటీటీ లోకి రానుందట.

ఇదిలా ఉండగా ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ అయితే వచ్చింది. మోడ్రన్ క్లాసిక్ మూవీ అంటూ సెలబ్రెటీలు మూవీ టీం పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక మొదటిరోజు వరల్డ్ వైడ్ గా దాదాపు 7 కోట్ల షేర్ ను రాబట్టింది. రెండో రోజు నుంచి కలెక్షన్స్ డబుల్ అయ్యే ఛాన్స్ గట్టిగా ఉంది. అదే ఊపును కొనసాగిస్తే, అతి త్వరలోనే బ్రేక్ ఈవెన్ అందుకోవచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు