Krithi Shetty : బాల సినిమా అంటే అంతేగా !

తమిళ దర్శకుడు బాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్న స్టోరీలతో సినిమాలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. బాల ముఖ్యంగా సమాజంలో ఉన్న సమస్యలనే ఎంచుకుని సినిమాగా మలుస్తాడు. బాల నుంచి వచ్చిన శివ పుత్రుడు, వాడు వీడు, నేనే దేవున్ని, పరదేశి లాంటి సినిమాలు ఎప్పటికీ మర్చిపోలేం. ఈ సినిమాలు తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించాయి.

కాగా, ఈ స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం సూర్యతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కు సూర్య41 అనే వర్కింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. బాల-సూర్య కాంబినేషన్ లో ఇప్పటికే నంద, శివపుత్రుడు లాంటి సినిమాలు వచ్చాయి. తాజాగా వీరి కాంబోలో హ్యాట్రిక్ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో సూర్య సరసన కృతి శెట్టి నటిస్తుంది. దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

ఇదిలా ఉండగా, ఈ సినిమా గురించి తాజాగా కృతి శెట్టి ఒక ఇంటర్వ్యూలో స్పందించింది. తన తర్వాతి సినిమా సూర్యతో ఉందని వెల్లడించింది. అయితే ఇది కమర్షియల్ సినిమా కాదని, చాలా ట్విస్టులతో స్టోరీ సాగుతుందని కృతి శెట్టి చెప్పుకొచ్చింది. నిజానికి బాల సినిమాలు అంటే కమర్షియల్ సినిమాలు కావు. విభిన్నమైన స్టోరీతో, సాధారణ ప్రేక్షకులకు కూడా చేరుకునే కథాంశంతో వస్తాడు. ఇప్పుడు సూర్య 41 కు కూడా అలాంటి స్టోరీనే ఎంచుకున్నాడని కృతి శెట్టి ద్వారా తెలిసిపోయింది. అంటే సూర్యకు బాల మరో హిట్ ను ఇస్తాడు అని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు