Vijay Devarakonda : బాలీవుడ్ మార్కెట్ పై గురి

యంగ్ హీరోల్లో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. మొదటి సారి హీరోగా చేసిన పెళ్లి చూపులు నుంచే ఈ క్రేజ్ బీజం పడింది. తర్వాత అర్జున్ రెడ్డితో విజయ్ ఇమేజ్ ఆకాశమే హద్దుగా పెరిగింది. దీని తర్వాత చెప్పుకోదగ్గ సినిమా గీత గోవిందం. విజయ్ కెరీర్ లో హిట్ అని చెప్పుకునే సినిమాలు ఈ మూడు మాత్రమే. కానీ, ఈ రౌడీ హీరోకు ఉన్న ఇమేజ్ ను చూస్తే అలా అనిపించదు. వీటి తర్వాత వచ్చిన సినిమాలు పెద్ద విజయాన్ని సాధించలేదు. అయినా విజయ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. తెలుగు మార్కెట్ లో ఎలాంటి ప్రమోషన్స్ చేయకున్నా విజయ్ సినిమా ఆడుతుంది.

రౌడీ హీరోకు కూడా అదే ధీమా ఉంది కాబోలు. తాను నటించిన లైగర్ సినిమాను తెలుగులో కంటే బాలీవుడ్ లోనే ఎక్కువ ప్రమోషన్స్ చేస్తున్నాడు. ముంబైలోనే ఉంటూ, హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. అలాగే వినూత్నంగా లైగర్ ప్రమోషన్స్ చేస్తూ వార్తల్లో నిలిస్తున్నాడు. ఇప్పటికే ముంబైలో ఫ్యాన్స్ తో ఏర్పాటు చేసిన సమావేశం, ఎక్కువ మంది రావడంతో రద్దు అయింది. దీంతో ముంబైలో రౌడీ హీరో ఫ్యాన్స్ జోరు అంటూ వార్తలు వచ్చాయి.

తాజాగా మరోసారి వినూత్నంగా ప్రమోషన్స్ చేసి మీడియా దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. బీహార్ రాష్ట్రంలో చాలా ఫేమస్ అయిన “గ్రాడ్యుయేట్ చాయ్ వాలా” తో మీట్ అయ్యాడు. అక్కడే లైగర్ ప్రమోషన్స్ కూడా చేశాడు. ఆ సమయంలోని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాను ప్రమోట్ చేయడం విజయ్ కి బాగా తెలుసు అంటూ నెటిజన్లు కామెంట్ కూడా చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు