VICHITRA: న‌న్ను రూముకు పిలిచాడు…బాల‌య్య‌పై హీరోయిన్ సెన్సేష‌న‌ల్ కామెంట్స్..!

సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వార్తలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి. కొంతమంది వేధింపులకు గురైనప్పుడే నోరు విప్పితే మరికొందరు అది జరిగి ఏళ్లు గడిచిన తరవాత నోరు విప్పుతుంటారు. ఇక కొన్నిసార్లు తప్పుడు ఆరోపణలు కూడా చేస్తుంటారు. అయితే తాజాగా ఒకప్పటి హీరోయిన్, తమిళ నటి విచిత్ర సంచలన ఆరోపణలు చేసింది. విచిత్ర ఒకప్పుడు తమిళ్ తో పాటూ తెలుగు సినిమాలలో హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం తమిళ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తోంది. కాగా రీసెంట్ గా విచిత్ర తమిళ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్‌లో జీవితాన్ని మ‌లుపుతిప్పిన ఘ‌ట‌న‌ల గురించి చెప్పాల‌ని బిగ్ బాస్ కోరారు. దాంతో హౌస్ మేట్స్ ఒక్కొక్క‌రూ వ‌చ్చి త‌మ జీవితంలో జ‌రిగిన విష‌యాల గురించి చెప్పారు.

కాగా విచిత్ర వ‌చ్చి హీరో బాల‌కృష్ణ‌పై షాకింగ్ కామెంట్లు చేశారు. 2000 సంవ‌త్స‌రంలో 20 ఏళ్ల క్రితం ఓ తెలుగు సినిమాలో న‌టించాన‌ని అన్నారు. ఆ సినిమా స‌మ‌యంలో కాస్టింగ్ కౌచ్ అనుభ‌వాన్ని ఎదురుకున్నాన‌ని తెలిపారు. 20 ఏళ్ల క్రితం సినిమాల‌కు దూరం అవ్వ‌డానికి కార‌ణం అదే అంటూ ఎమోష‌న‌ల్ అయ్యారు. అది త‌న గుండెల్లో ఇంకా ర‌గులుతూనే ఉంది అంటూ వ్యాఖ్యానించారు. సినిమా షూటింగ్ స‌మ‌యంలో త్రీ స్టార్ హోట‌ల్లో ఉంచార‌ని అన్నారు. ఆ హోట‌ల్ లో రాత్రి స‌మ‌యంలో పార్టీ జ‌రిగింద‌ని ఆ స‌మ‌యంలో సినిమా హీరోను క‌లిసానని అన్నారు.

ఆ హీరో పేరు కూడా త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పారు. కానీ క‌లిసిన వెంట‌నే ఆ హీరో త‌న గ‌దికి ర‌మ్మ‌న్నాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దాంతో భ‌య‌ప‌డిపోయి త‌న గ‌దికి వెళ్లి ప‌డుకున్నాన‌ని అన్నారు. ఆ త‌ర‌వాత త‌న‌కు షూటింగ్ లో వేధింపులు ఎదుర‌య్యాయ‌ని రోజూ రాత్రి ఎవ‌రో గ‌ది త‌లుపులు కొట్టేవార‌ని తెలిపారు. ఇదిలా ఉంటే విచిత్ర తెలుగు చేసింది ఒకే ఒక్క సినిమా భ‌లేవాడివి బాసూ. ఆ సినిమాలో హీరోగా బాల‌య్య న‌టించారు. దాంతో జాతీయ ప‌త్రిక‌ల్లో, సోష‌ల్ మీడియాలో హీరోయిన్ కు బాల‌య్య వేధింపులు అంటూ వార్త‌లు వ‌స్తున్నాయి.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు