NBK : ఆ సెంటిమెంట్ తో టైటిల్ ఫిక్స్ ?

నంద‌మూరి బాల‌కృష్ణ‌-బోయ‌పాటి కాంబోలో తెర‌కెక్కిన అఖండ సినిమా ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఇందులో బాల‌య్య ద్విపాత్రాభిన‌యంతో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు. ముఖ్యంగా అఖండ పాత్ర అద్భుత‌మ‌నే చెప్పాలి. అఖండ విజ‌యం త‌రువాత వ‌రుస సినిమాలు చేయ‌డానికి బాల‌య్య సిద్ధ‌మ‌య్యారు. ఓవైపు ఆహాలో అన్‌స్టాప‌బుల్ షో చేస్తూనే మ‌రోవైపు సినిమాలు, రాజ‌కీయాల్లో బిజీగా ఉన్నాడు బాల‌య్య‌.

ప్ర‌స్తుతం గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాకి ఇప్ప‌టివ‌ర‌కు అధికారికంగా టైటిల్ ప్ర‌క‌టించ‌లేదు. ప్ర‌స్తుతం ‘NBK 107’ అనే వ‌ర్కింగ్ టైటిల్ తోనే సినిమా తెర‌కెక్కుతుంది. ఈ సినిమా టైటిల్స్ పై ర‌క‌ర‌కాల వార్త‌లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అన్న‌గారు, రెడ్డిగారు, వీర‌సింహారెడ్డి అనే టైటిల్స్ పేర్లు వినిపిస్తున్నాయి. బాల‌య్య సినిమాకి ‘సింహా ‘అనే టైటిల్ ఉంటే ఆ సినిమా హిట్ అవుతుంద‌ని సెంటిమెంట్‌.

ఆ కోవ‌కు చెందిన‌వే స‌మ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహానాయుడు, ల‌క్ష్మిన‌ర‌సింహా, సింహా వంటి సినిమాలు హిట్ అయిన విష‌యం తెలిసిందే. తాజాగా బాల‌కృష్ణ సినిమాకు ‘వీర‌సింహారెడ్డి’ అనే టైటిల్ ఫిక్స్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇక ఈ సినిమా టైటిల్ ని అక్టోబ‌ర్ 21న క‌ర్నూల్‌లోని కొండారెడ్డి బురుజు వ‌ద్ద విడుద‌ల చేయ‌నున్నార‌ట‌. టైటిల్ విడుద‌ల అక్టోబ‌ర్ 21 రాత్రి 8.15 గంట‌ల‌కు ఉంటుందని తాజాగా ఓ పోస్ట‌ర్ ని విడుద‌ల చేసింది చిత్ర బృందం.

- Advertisement -

మ‌రోవైపు ఈ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రానున్న‌ట్టు స‌మాచారం. బాల‌కృష్ణ సినిమా, చిరంజీవి సినిమా రెండింటికి నిర్మాత ఒక్క‌రే కావ‌డంతో బాల‌య్య సినిమాని సంక్రాంతి బ‌రిలోంచి లేకుండా ముందుగానే విడుద‌ల చేద్దామంటే అందుకు బాల‌య్య ఒప్పుకోక‌పోవ‌డం విశేషం. మొత్తానికి అక్టోబ‌ర్ 21న విడుద‌ల‌య్యే టైటిల్ బాల‌య్య సెంటిమెంట్ టైటిల్ ఉంటుందో లేదో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు