Babloo Prithiveeraj : రెండో భార్యతో కూడా బ్రేకప్.. క్లారిటీ ఇచ్చిన శీతల్..

మొదట సీరియల్స్ ద్వారా పాపులారిటీ సంపాదించుకొని.. ఆ తర్వాత వెండితెర పైన అడుగుపెట్టిన వారు చాలామంది ఉన్నారు.. అలాంటివారిలో సీనియర్ యాక్టర్ బబ్లూ పృథ్వీరాజ్ కూడా ఒకరు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించి కెరియర్ మధ్యలో హీరోగా కూడా నటించారు. ఆ తర్వాత విలన్ గా కూడా ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించారు ..బబ్లూ పృథ్వీరాజ్ సినిమాల కన్నా మిగతా విషయాలలోనే ఎక్కువగా వార్తలలో నిలుస్తూ ఉంటారు. పృథ్వీరాజ్ మొదట బీనా అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. వీరికి అహద్ మెహన్ జబ్బర్ అనే బాబు కూడా జన్మించారు.

మొదటి భార్యతో అందుకే విడిపోయా..
అయితే పృథ్వీరాజ్ కుమారుడు ఆటిజం తో బాధపడుతున్నారు. బాబు విషయంలో తరచూ ఇద్దరి మధ్య గొడవలు అయ్యేవట.. ఈ కారణంగానే పృథ్వీరాజ్ – బీనా విడిపోవడం జరిగింది.. ఆ తర్వాత తెలుగు అమ్మాయి శీతల్ తో ప్రేమలో పడి ఆమెతో ప్రేమాయణం కొనసాగించారు ..అప్పట్లో వీరి విషయం హాట్ టాపిక్ గా మారింది.. వీరికి సంబంధించి మీడియాలో కూడా పలు రకాల వార్తలు వినిపించాయి.. ముఖ్యంగా 56 ఏళ్ల వయసులో తనకన్నా సగం వయసు ఉన్న శీతల్ ను పృథ్వీరాజ్ పెళ్లి చేసుకున్నారనే వార్తలు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు తాజాగా శీతల్ నుంచి కూడా పృథ్వీరాజ్ దూరమైనట్లుగా రూమర్స్ అయితే వినిపించాయి.

బబ్లూ పృథ్వీరాజ్ తో బ్రేకప్ పై శీతల్ క్లారిటీ..
అంతేకాదు ఈ విషయాన్ని శీతల్ స్వయంగానే వెల్లడించింది.. శీతల్ ఒంటరిగా కనిపించడం గమనించిన పలువురు నెటిజెన్స్ పృథ్వీ రాజ్ గురించి అడగగా దానికి ఆమె తామిద్దరం విడిపోయామని ఇంస్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ ఈ వార్తల పైన క్లారిటీ ఇచ్చేసింది.. ఎంతోమంది తమ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఎన్నో రకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు.. పరిస్థితి అర్థం చేసుకోకుండా ఏవేవో మాట్లాడుతూ ఉంటారు.. పృథ్వి రాజ్ తో నా పెళ్లి అసలు జరగలేదు..కానీ మేమిద్దరం సహజీవనం చేశాము..అయితే మేము మీరు ఊహించుకుంటున్నట్లుగా మా రిలేషన్షిప్ ముందుకు వెళ్లలేక పోయింది.. అందుకే ఇద్దరం విడిపోయామంటూ వెల్లడించారు.

- Advertisement -

సైలెంట్ అయినా పృథ్వీరాజ్..
అయితే ఈ ప్రయాణంలో తామిద్దరం చాలా సంతోషంగానే ఉన్నామని శీతల్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో రాసుకుంది.. అంతేకాకుండా మా నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తారని వ్యక్తిగత విషయాలకు ఎలాంటి భంగం కలిగించవద్దంటూ ఆమె రిక్వెస్ట్ చేస్తోంది.. నటుడు పృథ్వీ రాజ్ తో తన పెళ్లి జరిగిందనే రూమర్స్ కి ఇద్దరి పైన వచ్చిన వార్తలకు ఇన్ని రోజులకు క్లారిటీ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.. గతంలో కూడా ఇద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు అయితే ఇప్పుడు మళ్లీ ఎవరి దారి వారు చూసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే శీతల్ నుంచి దూరమైన పృథ్వీరాజ్ ఈ విషయాన్ని చాలా సీక్రెట్ గానే ఉంచారు. ఇటీవల కాలంలో పృథ్వీరాజ్ పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఈ విషయాన్ని శీతల్ ధైర్యంగా బయటకి చెప్పినా పృధ్విరాజ్ చెప్పకపోవడంతో పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి..

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు