Kamna Jethmalani: ఇద్దరు పిల్లలతో దర్శనం ఇచ్చిన హీరోయిన్‌ !

టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంతో మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం అలా పాతుకు పోతూ ఉంటారు. ముఖ్యంగా మన టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఎక్కువగా ఉన్నారు హీరోయిన్లు. ఇక్కడ తెలుగు వారు మాత్రం చాలా తక్కువ. ఎందుకంటే మన తెలుగు హీరోయిన్లు అస్సలు ఎక్స్పోజింగ్, రొమాంటిక్ సీన్లలో అస్సలు నటించరు. కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్లు మాత్రం అన్నిటికీ ఓకే చెప్పేస్తారు.

అలా చాలామంది హీరోయిన్లు తెలుగులో చాన్సులు కొట్టేసి దాదాపు కొన్ని సంవత్సరాల పాటు టాప్ మోస్ట్ హీరోయిన్గా కొనసాగారు. చిన్న సినిమాలలో కూడా వరుసగా చాన్సులు కొట్టేశారు. అలాంటి హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో కామ్ నా జన్మలోని ఒకరు. హీరోయిన్ కామ్నా జఠ్మలానీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ముంబైలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ ఫస్ట్.. మోడల్గా ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా మారిపోయింది హీరోయిన్ కామ్నా జఠ్మలానీ.

రణం మూవీతో పాపులారిటీ

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ… హీరోయిన్ కామ్నా జఠ్మలానీకి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. తన అంత చెందాలతో ఇప్పటికీ కూడా యూత్ ను ఆకట్టుకుంటుంది. తెలుగు ఇండస్ట్రీపై ఒక్కసారిగా వెలుగు వెలిగి ఆ తర్వాత కనుమరుగు కూడా అయింది ఈ బ్యూటీ. రణం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో బంపర్ విజయం అందుకుంది హీరోయిన్ కామ్నా జఠ్మలానీ.

ఆ తర్వాత తెలుగులోనే కాకుండా తమిళ మరియు కన్నడ చిత్ర పరిశ్రమలలో వరుసగా సినిమాలు చేసింది. అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకొని ఇండస్ట్రీలో… బిజీ హీరోయిన్గా మారిపోయింది హీరోయిన్ కామ్నా జఠ్మలానీ. 2015 వరకు సినిమాలు చేసిన హీరోయిన్ కామ్నా జఠ్మలానీ… సామాన్యుడు, రణం, సైనికుడు, ప్రేమికులు, కింగ్, బెండు అప్పారావు ఆర్ఎంపి, కత్తి కాంతారావు లాంటి బంపర్ హిట్ సినిమాలు చేసింది.

2015 లో వివాహ బంధంలోకి అడుగు

హీరోయిన్ కామ్నా జఠ్మలానీ… సినిమాలు చేస్తూనే 2014 సంవత్సరం ఆగస్టు 11వ తేదీన పెళ్లి చేసుకుంది. బెంగళూరు నగరానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త సూరజ్ నాగ్ పాల్ ను వివాహమాడింది హీరోయిన్ కామ్నా జఠ్మలానీ. ఇక పెళ్లి తర్వాత సంవత్సరానికే సినిమాలు ఆపేసింది. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే…హీరోయిన్ కామ్నా జఠ్మలానీ… తాజాగా తన కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోలు వైరల్ చేసింది. ఇందులో తన ఇద్దరు కూతుర్లతో కనిపించింది హీరోయిన్ కామ్నా జఠ్మలానీ. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు