Roshan: టాలీవుడ్లో మరో పాన్ ఇండియా హీరో..!

టాలీవుడ్లో ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. RRR సినిమా ఇచ్చిన బూస్టప్ తో చిన్న చిన్న హీరోలు సైతం పాన్ ఇండియా సినిమాలు తీసి బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నారు. ఇప్పటికే నాని, నిఖిల్, వంటి యంగ్ హీరోలు పాన్ ఇండియా హిట్స్ అందుకోగా, పెళ్ళిసందడి సినిమా ద్వారా కమర్షియల్ హీరోగా మారిన శ్రీకాంత్ తనయుడు రోషన్ కూడా పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. పెళ్ళిసందడి సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో కొంత గ్యాప్ తీసుకున్న రోషన్ ప్రస్తుతం కన్నడ దర్శకుడు నందకుమార్ డైరెక్షన్లో మోహన్ లాల్ తో కలిసి ఒక పాన్ ఇండియా సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.

ఈ సినిమాలో మోహన్ లాల్, రోషన్ తండ్రి కొడుకులుగా కనిపించనున్నారని సమాచారం. త్వరలోనే హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుందని సమాచారం. ఈ సినిమా తర్వాత రోషన్ వైజయంతి మూవీస్ బ్యానర్లో మరో సినిమా ఓకే చేశాడని సమాచారం. ప్రదీప్ అద్వైతం అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేయబోయే ఈ సినిమా లవ్ స్టోరీగా రూపొందనుందని సమాచారం. త్వరలోనే ఇందుకు సంబందించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందట.

పెళ్ళిసందడి తర్వాత గ్యాప్ తీసుకొని వరుసగా సినిమాలను లైన్లో పెడుతున్న రోషన్ కి ఈ సినిమా హిట్ అవ్వటం కీలకం అని చెప్పాలి. మరి, లుక్స్ పరంగా, డ్యాన్స్ పరంగా మంచి ప్రెజెన్స్ ఉన్న రోషన్  హీరోగా నటిస్తున్న రెండో సినిమాతోనే పాన్ ఇండియా స్థాయి బ్లాక్ బస్టర్ అందుకుంటాడా లేదా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు