Trivikram: బన్నీ కి అలవాటే, త్రివిక్రమ్ కే మొదటిసారి

త్రివిక్రమ్ శ్రీనివాస్, తెలుగు భాష పై ఈయనకు ఉన్న పట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తరంలో ఒక అద్భుతమైన రచయితను పోల్చాలి అని అంటే త్రివిక్రమ్ లా రాస్తున్నావని కొంతమంది అంటుంటారు. రైటింగ్ లో అంతటి ఇంపాక్ట్ ని క్రియేట్ చేశాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. పంచులు ప్రాసలతో పాటు భావాలను వ్యక్తపరచటంలో త్రివిక్రమ్ కలం కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

స్వయంవరం సినిమాతో రచయితగా కెరియర్ మొదలుపెట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్ అతి తక్కువ కాలంలోనే మంచి పేరును సంపాదించుకున్నాడు. మంచి బిజీ రైటర్ అయిపోయాడు. త్రివిక్రమ్ సినిమా రాస్తున్నాడు అంటే త్రివిక్రమ్ పేరును చూసే థియేటర్ కి వెళ్లిన ఆడియన్స్ కూడా ఉన్నారు. త్రివిక్రమ్ రైటింగ్లో ఒక మ్యాజిక్ ఉంటుంది. జంధ్యాల తర్వాత అంత గొప్పగా రాయగలిగే సామర్థ్యం ఉన్న రచయిత అని త్రివిక్రమ్ ను అంటుంటారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టింది భీమవరంలో తను చదివిన పుస్తకాల వలన తెలుగు భాష పై మంచి పట్టును సంపాదించుకున్నాడు. అయితే రీసెంట్ టైమ్స్ లో త్రివిక్రమ్ మంచి సూపర్ హిట్ సినిమాలు చేశాడు. ఆయా సినిమాలలో భాషల గురించి కూడా త్రివిక్రమ్ రీసెర్చ్ చేసి ఆ సినిమాలను హిట్ చేసే సందర్భాలు ఉన్నాయి. అరవింద సమేత వీర రాఘవ సినిమాలో ఎన్టీఆర్ రాయలసీమ ప్రాంతపు భాషను అచ్చు గుద్దినట్లు దించేశాడు అని చెప్పొచ్చు.

- Advertisement -

ఇకపోతే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేసిన గుంటూరు కారం సినిమాలో గుంటూరు స్లాంగ్ ను అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మిశ్రమ స్పందనతో అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. ఇది కేవలం మహేష్ బాబుకు ఉన్న ఫ్యాన్ బేస్ వలన వచ్చిందని చాలామంది అంటూ వచ్చారు.

ప్రస్తుతం త్రివిక్రమ్ తన తదుపరి సినిమాని అల్లు అర్జున్ తో చేయనున్నట్లు ఇదివరకే ఎప్పుడో ప్రకటించారు. అయితే ఈ సినిమా త్రివిక్రమ్ కెరియర్లో మునుపెన్నడూ చేయనటువంటి అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ తెలంగాణ మాండలీకంను మాట్లాడబోతున్నట్లు తెలుస్తుంది. ఇదివరకే రుద్రమదేవి సినిమాలో తెలంగాణ మాండలీకముతో తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు బన్నీ. ఇది బన్నీకి కొత్త విషయం కాకపోవచ్చు త్రివిక్రమ్ కి కొత్త విషయం. ఇప్పుడు త్రివిక్రమ్ ఈ సినిమాను ఎలా తీర్చదిద్దబోతున్నాడు అని చాలామంది ఎదురుచూస్తున్నారు.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు