పుష్ప-2తో అల్లు అర్జున్ బిగెస్ట్ పాన్ ఇండియా స్టార్..!

ప్ర‌స్తుతం అన్ని ఇండ‌స్ట్రీల్లో పాన్ ఇండియా సినిమాల‌ ట్రెండ్ నడుస్తుంది. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ బాహుబ‌లి ది బిగినింగ్ సినిమాతో మొద‌టి సారి పాన్ ఇండియా అనే ప‌దం వ‌చ్చింది. దీని త‌ర్వాత బాహుబ‌లి-2 ది క‌న్‌క్లూజ‌న్ సినిమాతో ప్ర‌భాస్ కు ఏకంగా పాన్ ఇండియా స్టార్ అనే బిరుదు వ‌చ్చేసింది. దీని త‌ర్వాత నుంచే.. ఈ సినిమాల‌కు డిమాండ్ పెరిగింది. అన్ని భాషాల హీరోలు, డైరెక్ట‌ర్లు.. ఇలాంటి సినిమాలకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో లోకల్ హీరోలు పాన్ ఇండియా స్టార్స్ గా ఎదుగుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ పాన్ ఇండియా రేంజ్ లో చాలా సినిమాలు వ‌చ్చినా.. కొన్ని బోల్త కొట్టాయి.

దంగ‌ల్, సీక్రెట్ సూప‌ర్ స్టార్ తో అమీర్ ఖాన్ బిగెస్ట్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. సుల్తాన్ తో స‌ల్మాన్ ఖాన్, రోబో 2.0 తో ర‌జినికాంత్, కేజీఎఫ్ సినిమాల‌తో య‌ష్ కూడా ఇదే గుర్తింపు తెచ్చుకున్నారు. కాగ అల్లు అర్జున్ కూడా బిగెస్ట్ పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ తెచ్చుకోవ‌డానికి ఎంతో స‌మ‌యం లేదని తెలుస్తుంది. ఇప్ప‌టికే పుష్ప పార్ట్ 1 సినిమాతో అల్లు అర్జున్ నేష‌న‌ల్ స్టార్ ట్యాగ్ త‌గిలించుకున్నాడు. త్వ‌ర‌లో రాబోతున్న పుష్ప పార్ట్ 2 తో బిగెస్ట్ పాన్ ఇండియా స్టార్ట్ లిస్ట్ లో చేరడం దాదాపు ఖాయ‌మే అని సినీ క్రిటిక్స్ అభిప్రాయ ప‌డుతున్నారు.

పుష్ప పార్ట్-1 ది రైజ్ సినిమాలో పాట‌లు, డైలాగ్స్ కు ప్ర‌పంచ వ్యాప్తంగా ఆధార‌ణ ల‌భించింది. దీనికి సీక్వెల్ గా తెర‌కెక్కుతున్న పుష్ప పార్ట్-2 ది రూల్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ త‌న మార్క్ స్టోరీతో ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా బిగ్ హిట్ కొడుతుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు కూడా అంచ‌నా వేస్తున్నాయి. దీంతో అల్లు అర్జున్.. బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ గా రూల్ చేస్తాడ‌ని ఫ్యాన్స్ జోస్యం చెబుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు