బుట్ట‌బొమ్మ‌ కోసం స్టార్ హీరోల‌ ఫ్యాన్స్ ‘వార్’..!

టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోయిన్స్ ల‌లో పూజా హెగ్డే ఒక్క‌రు. అన్ని భాషాల్లో వ‌రుస‌గా సినిమాలు చేస్తూ స్టార్ డ‌మ్ ను పెంచుకుంటుంది. కెరీర్ లో సూప‌ర్ హిట్ సినిమాలు వ‌చ్చినా.. త‌న‌పై ఐరెన్ లెగ్ ట్యాగ్ మాత్రం పోవ‌డం లేదు. ఈ భామ‌ ముందుగా త‌మిళంలో ముగ‌మూడి మూవీతో హీరోయిన్ గా అరంగేట్రం చేసింది. ఈ సినిమా ప్లాప్ కావ‌డంతో టాలీవుడ్ పై క‌న్నేసింది. వ‌రుస‌గా ఒక లైలా కోసం, ముకుందా సినిమాలు చేసింది. ఈ సినిమాలు కూడా ఈ భామ‌కు హిట్ ను అందించలేదు. హిట్స్ లేకపోయినా.. బాలీవుడ్ లో హృతిక్ రోష‌న్ తో భారీ బ‌డ్జెట్ మూవీ మొహంజోదారో లో చాన్స్ కొట్టేసింది. ఈ మూవీతో పూజా బీ టౌన్ లోనే సెటిల్ అవ్వాల‌ని అనుకుంది. కానీ ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. క‌నీసం బ్రేక్ ఈవెన్ కూడా కాలేదు.

ఎక్క‌డ అడుగు పెట్టినా.. ప్లాప్ రావ‌డంతో ఈ అమ్మ‌డి మెడలో ఐరెన్ లెగ్ ట్యాగ్ వ‌చ్చి ప‌డింది. పూజా మ‌ళ్లీ టాలీవుడ్ బాట ప‌ట్టింది. తెలుగులో అల్లు అర్జున్ దువ్వాడ జ‌గ‌న్నాథం సినిమాతో ఈ బ్యూటీఫుల్ హీరోయిన్ ఫ‌స్ట్ హిట్ ను అందుకుంది. అల్లు అర్జున్ తో కెమిస్ట్రీ వ‌ర్కౌట్ కావ‌డంతో పూజాకు మంచి మార్కులు ప‌డ్డాయి. త‌ర్వాత తారక్ స‌ర‌స‌న అర‌వింద స‌మేత వీర రాఘ‌వ చేసింది. ఇది బాక్సాఫీస్ ను షేక్ చేసింది.

దీని త‌ర్వాత అవ‌కాశాలు క్యూ క‌ట్టాయి. మంచి హిట్స్ ను కూడా అందుకుంది. ఐరెన్ లెగ్ నుంచి గోల్డెన్ లేడీగా మారింది. దీంతో ప్ర‌భాస్ రాధేశ్యామ్, విజ‌య్ బీస్ట్ లో చాన్స్ వ‌చ్చాయి. ఈ రెండు సినిమాలు నెగెటివ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. దీంతో ద‌ళ‌ప‌తి, డార్లింగ్ ఫ్యాన్స్.. పూజా ఐరెన్ లెగ్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం బుట్ట‌బొమ్మ‌ను స‌పోర్ట్ చేస్తున్నారు. మొత్తానికి గోపిక‌మ్మ కోసం స్టార్ హీరోల ఫ్యాన్స్ మ‌ధ్య వార్ న‌డుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు