యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తర్వాత కొరటాల శివతో ఓ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వచ్చింది. స్టూడెంట్ పాలిటిక్స్ నేపథ్యంలో వచ్చే యాక్షన్ ఎంటర్‌టైన్ మెంట్ స్టోరీని తారక్ కోసం కొరటాల శివ సిద్ధం చేశాడని టాక్. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించే ఈ సినిమా కోసం బాలీవుడ్ నుంచి నటీ నటులను తీసుకోవాలని కొరటాల శివ ప్లాన్ వేస్తున్నారు. హీరోయిన్ గా అలియా భట్ ను ఇప్పటికే ఎంచుకున్నట్టు ప్రచారం జరిగింది. దీని డైరెక్టర్ కొరటాల ఆఫీషియల్ అనౌన్స్ చేయకున్నా.. అలియా మాత్రం కన్ఫామ్ చేసింది. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కొరటాల శివతో ఉంటుందని ఓ సందర్భంలో ప్రకటించింది. అలియా భట్ ఖరారు కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు పెరిగాయి.
అయితే.. బాలీవుడ్ లవ్ బర్డ్స్ అలియా భట్ – రణ్ బీర్ కపూర్ ఇటీవల పెళ్లి పీఠలెక్కారు. ఐదేళ్ల పాటు సాగిన ప్రేమాయణానికి ఏప్రిల్ 14న స్వస్తి పలికి ఒక్కటైయ్యారు. దీంతో వ్యక్తిగత జీవితానికి కాస్త సమయం కేటాయించాలని అలియా భట్ నిర్ణయం తీసుకుందని సమాచారం. దీంతో ఎన్టీఆర్-కొరటాల సినిమా నుంచి అవుట్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో కొరటాల శివ మరో హీరోయిన్ ను వెతికే పనిలో పడ్డాడట. పాన్ ఇండియా సినిమా కావడంతో బాలీవుడ్ నుంచే హీరోయిన్ ను ఎంపిక చేయాలని ప్రయత్నిస్తున్నాడట. అయితే అలియా భట్ లాంటి టాలెంటెడ్ హీరోయిన్ ను భర్తీ చేసేది ఎవరో చూడాలి మరి.