‘క‌ళావతి’ పై నెగెటివ్ కామెంట్స్..!

మ‌హాన‌టి సినిమాతో కావాల్సినంత క్రేజ్ ను సొంతం చేసుకున్న కీర్తి సురేష్.. ప్ర‌స్తుతం టాలీవుడ్ తో పాటు ఇత‌ర భాషాల ప‌రిశ్ర‌మ‌ల్లో లీడింగ్ హీరోయిన్ గా ఎదిగింది. సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వ‌చ్చినా.. త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. త‌న క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్ తో నేను శైల‌జ గా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. మొద‌టి సినిమాతోనే పాజిటివ్ టాక్ ను ద‌క్కించుకుంది. అనంత‌రం తెలుగులో ఈ అమ్మ‌డికి అవకాశాలు క్యూ క‌ట్టాయి. ఏకంగా సావిత్రి బయోపిక్.. మ‌హాన‌టి ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాతో కీర్తి స్టార్ డ‌మ్ ఒక్క సారి హై రేంజ్ కు చేరుకుంది. ఇక వెన‌క్కి తిరిగి చూడ‌కుండా… తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం వ‌రుస‌గా సినిమాలు చేసింది.

ఈ ఏడాది గుడ్ ల‌క్ స‌ఖీ తో పాటు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు స‌ర్కారు వారి పాట సినిమాల్లో న‌టించింది. లేడీ ఓరియెంటెడ్ సినిమా అయిన గుడ్ ల‌క్ స‌ఖీ ప‌రాజ‌యం చ‌వి చూసింది. స‌ర్కార్ వారి పాట మే 12 రిలీజ్ కానుంది. ముద్దుగా బొద్దుగా ఉండే మ‌హాన‌టి.. ఈ సినిమా కోసం లుక్ మొత్తం మార్చేసి.. స్లిమ్ గా మారింది. ఇటీవ‌ల స‌ర్కారు వారి పాట నుంచి వ‌చ్చిన క‌ళావ‌తి సాంగ్ లో కీర్తీ న్యూ లుక్ ద‌ర్శ‌నమిస్తోంది. అయితే ఈ న్యూ లుక్ పై ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నార‌ని తెలుస్తుంది. దీనిపై మ‌హాన‌టి నెగెటివ్ కామెంట్స్ ను కూడా ఎదుర్కొంటుంది. కాగ ఒక్క సాంగ్ కే కీర్తి లుక్ పై క్లారిటీకి రాకుండా.. సినిమాలో చూడాల‌ని కొంత మంది ఫ్యాన్స్ అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు