Subbaraju birthday special : విలక్షణ నటుడ్ని టాలీవుడ్ గుర్తించేది ఎన్నడో?

టాలీవుడ్ లో ఎంతో టాలెంట్ ఉన్న విలక్షణ నటుల్లో సుబ్బరాజు ఒకరు. ఆరడుగుల హీరో కటౌట్ ఉన్న ఈ నటుడు ఏ రోల్ ఇచ్చినా అలవోకగా చేయగల దిట్ట. ప్రతినాయకుడి పాత్రలు ఎక్కువగా వేసినా, అన్ని రకాల పాత్రలు వేయగల అతితక్కువ మంది నటుల్లో సుబ్బరాజు ఒకరు. హీరో అన్నగా, హీరోయిన్ బాబాయ్ గా, పాపకు తండ్రిగా, విలన్ల తమ్ముడిగా, పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అయినా, సినిమాలో హీరో ఫ్యామిలీకి గార్డియన్ లా, ఇలా అనేక రకాల పాత్రల్లో ఒదిగిపోయే నటుడు సుబ్బరాజు. అలాంటి విలక్షణ నటుడు సుబ్బరాజు బర్త్ డే ఈరోజు. ఈ సందర్బంగా సుబ్బరాజు గురించి ఒక చిన్న స్పెషల్ స్టోరీ డిస్కస్ చేద్దాం.

ఎక్కడో భీమవరం కి చెందిన సుబ్బరాజు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశి చొరవతో టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమయ్యాడు. అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీ లో జూనియర్ ఆర్టిస్ట్ నుండి మెయిన్ లీడ్ గా సినిమాలు చేసే రేంజ్ కి ఎదిగాడు. పదేళ్ల కింద అయితే టాలీవుడ్ లో ఏ పెద్ద హీరో వచ్చినా అందులో ఏదో ఒక రోల్ లో సుబ్బరాజు కనిపించేవాడు. విలన్ గా అయినా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయినా ఖచ్చితంగా ఈయన గురించి స్పెషల్ రోల్ ఉండేది. ముఖ్యంగా పూరి జగన్నాథ్ లాంటి దర్శకులు సుబ్బరాజు నటనని బాగా వాడుకునే వారు. ఒక నాయర్, ఒక మురుగేశన్, ఒక గోవర్ధన్ ఇలాంటి ఎన్నో రోల్స్ లో సుబ్బరాజు తన వేరియేషన్స్ తో ఆకట్టుకున్నాడు.

అయితే గత కొన్నాళ్లుగా మాత్రం ఈయన కటౌట్ కి తగ్గ రోల్స్ మాత్రం దొరకడం లేదు. ఇప్పుడు చేస్తున్న చాలా సినిమాల్లో ఈయనకి కామెడీ స్కోప్ ఉండే పాత్రలే ఎక్కువగా ఇస్తున్నారు. సుబ్బరాజు కామెడీ కూడా బాగా చేసినా, ఈ మధ్య డైరెక్టర్లు మరీ బఫున్ అయ్యే పాత్రలు ఇస్తున్నట్టు ఉంది. ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లు అందరూ పాన్ ఇండియా పేరుతో పరభాషా నటుల్ని ఎంకరేజ్ చేసే ముందు ఇలాంటి అద్భుత విలక్షణమైన నటుల్ని ఆదరించాలని తెలుగు సినీ ప్రేక్షకులు కోరుకుంటున్నారు. కంటెంట్ ఉంటే ఏ భాషకి చెందిన నటుల్ని అయినా ఆదరిస్తారు జనాలు. కానీ ఇలాంటి టాలెంట్ ఉన్న తెలుగు అర్టిస్టులని మనవాళ్లే సరిగ్గా వాడుకోకపోతే ఎలా అని ట్రేడ్ విమర్శకులు కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

అయితే సుబ్బరాజు నటుడుగా బిజీ గా ఉన్నా, తన కెరీర్ టర్న్ చేసే ఒక్క సినిమా కోసం రెండు దశాబ్దాలుగా వెయిట్ చేయాల్సి వస్తుంది. రంగస్థలం తో అజయ్ ఘోష్ కి బ్రేక్ వచ్చినట్టు, పుష్ప తో సునీల్ కి బ్రేక్ వచ్చినట్టు, సుబ్బరాజుకి కూడా ఒక సెకండ్ ఇన్నింగ్స్ బ్రేక్ రావాలని టాలీవుడ్ జనాలు భావిస్తున్నారు. మరి తెలుగు దర్శకులు సుబ్బరాజుని ఎప్పుడు గుర్తిస్తారో.. ఇప్పుడు ఈ టాలెంటెడ్ నటుడికి బ్రేక్ వస్తుందో..

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు