Boby Deol : సౌత్ కి షిఫ్ట్ అవుతున్న బాలీవుడ్ స్టార్ విలన్..!

ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో బాబీ డియోల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ జెనరేషన్ ఆడియన్స్ కి అతను హీరో అని పెద్దగా తెలియదేమో గాని ఒకప్పుడు బాలీవుడ్ లో సల్మాన్, షారుఖ్ కి పోటీ ఇచ్చిన హీరో. వరుస ప్లాపులతో మార్కెట్ కోల్పోయి ఫేడ్ అవుట్ ఆయిన సన్నీ డియోల్ తాజాగా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన అనిమల్ మూవీ తో విలన్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే. అనిమల్ సినిమా బాబీ డియోల్ కి ఓ కొత్త ఊపిరినిచ్చింది అని చెప్పొచ్చు.

ఇక అనిమల్ తర్వాత బాబీ డియోల్ కి సౌత్ లో మాత్రం వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అయితే అన్నిటికంటే ముందుగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీరమల్లు లోనే విలన్ గా పాత్ర వచ్చింది. కొన్ని రోజులు బాబీ డియోల్ షూటింగ్ లో కూడా పాల్గొన్నాడు. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయల్లో బుడి అవడంతో ఆ సినిమాని కొంత కాలం వాయిదా వేశారు. ఆ తరువాత అనిమల్ లో నటించడం బ్లాక్ బస్టర్ అవడం జరిగింది. ఇక తాజాగా తెలుగు లో బాబీ దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటిస్తున్న సినిమాలో కూడా విలన్ గా బాబీ డియోల్ నటిస్తున్నాడు.

ఇదే కాక తమిళ్ లో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ “కంగువ” లో కూడా బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. నిన్న బాబీ డియోల్ బర్త్ డే సందర్బంగా ఈ సినిమాల మేకర్స్ బర్త్ డే విషెస్ తెలుపుతూ అనౌన్స్ చేయడం జరిగింది. ఇక వరుసగా బాబీ సౌత్ సినిమాలు చేస్తుండడంతో హైదరాబాద్ కి మకాం మార్చేయమని నెటిజన్లు ఫన్నీ గా కామెంట్స్ చేస్తున్నారు. రానున్న రోజుల్లో బాబి డియోల్ మరిన్ని సినిమాలు చేస్తే అలాగే చేయక తప్పదు మరి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు