Krishna Vamsi: మహేష్ బాబుతో ఇకపై కష్టం

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ లో ఒకరు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వీరిద్దరికి తెలుగులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి సినిమా రిలీజ్ అయితే తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. వీరి సినిమా రిలీజ్ అయితే ఒక పండగ రకమైన వాతావరణం నెలకొంటుంది. ఇప్పటికి తెలుగులో వీళ్లను కలెక్షన్స్ లో కొట్టే స్టార్ట్ లేరంటే అతిశయోక్తి కాదు. వీరిద్దరికి ఉన్న తెలుగు మార్కెట్ అలాంటిది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తూ మంచి సూపర్ హిట్ లు అందుకున్నారు. యూత్ ని ఒక క్రేజీ వేలో నడిపిస్తూ తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. పవన్ కెరియర్ లో తొలిప్రేమ, బద్రి, తమ్ముడు, ఖుషి వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లయ్యాయి. కానీ పవన్ కళ్యాణ్ దర్శకుడిగా చేసిన జానీ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. అప్పటినుంచి పవన్ సినిమాలు ఫెయిల్ అవుతున్న కూడా క్రేజ్ మాత్రం పెరుగుతూ వచ్చింది. ఇకపోతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న పరిస్థితి మనకు తెలిసిందే.

ఇక మహేష్ బాబు విషయానికి వస్తే మహేష్ బాబు కెరియర్ లో మురారి సినిమాకు ఉన్న ప్రత్యేకత వేరు. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఇప్పుడు ఆ సినిమా వచ్చినా కూడా టీవీలు ముందు అతుక్కుని కూర్చుంటారు. ఆ సినిమాలో ఉండే ఫ్యామిలీ ఎమోషన్స్ అలాంటివి. సంకల్పం ఎంత గొప్పది అని చూపించిన సినిమా అది. కృష్ణవంశీ ఆ సినిమాను తీసిన విధానం. ఎప్పటికీ ఒక కల్ట్ క్లాసిక్ అని చెప్పొచ్చు. ఆ రేంజ్ లో ఉంటుంది మురారి సినిమా.

- Advertisement -

ఇకపోతే రీసెంట్ గా ట్విట్టర్ వేదికగా ఒక అభిమాని కృష్ణవంశీ ని మెన్షన్ చేస్తూ మురారి వంటి సినిమాను మళ్ళీ మహేష్ బాబు తో ప్లాన్ చేయండి అంటూ చెప్పుకొచ్చాడు. అయితే దీనిపై దర్శకుడు కృష్ణవంశీ స్పందిస్తూ మహేష్ బాబు ఇకపైన ఇంటర్నేషనల్ స్టార్ అయిపోతాడు. అది జరగటం కష్టం అంటూ చెప్పుకొచ్చారు. అంటే ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమాను చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు తెలుగుకు మాత్రమే పరిమితమైన మహేష్ బాబు మార్కెట్ ఇకపై పాన్ ఇండియా స్థాయిలోకి చేరబోతుంది.

ఈ తరుణంలో కృష్ణవంశీ లాంటి క్రియేటివ్ డైరెక్టర్ తో మహేష్ బాబు మళ్లీ చేయి కలిపి ఒక గొప్ప ఫ్యామిలీ సినిమా చేయటం అనేది అసాధ్యమని చెప్పడమే కృష్ణవంశీ ఉద్దేశ్యం. ఏదేమైనా సరే మహేష్ కెరియర్లో మురారి సినిమాకు ఉన్న స్థానం వేరు దాని స్థాయి వేరు. కృష్ణవంశీ కు కూడా మంచి పేరు తీసుకొచ్చింది ఆ మురారి సినిమా.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు