Malayalam film industry : మూడు వారాల్లో మూడు అద్భుతాలు

తెలుగు ప్రేక్షకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక గొప్ప సినిమాను ఏ భాషలో ఉన్నా కూడా ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ముందుంటారు అనేది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. భాషతో సంబంధం లేకుండా ఒక మంచి సినిమాను చూడటం ప్రేక్షకులకి అలవాటు. తెలుగు ప్రేక్షకులంతా మన జీవితంలో ఉన్న ఏకైక వినోదం సినిమానే అనే ఆలోచనలో ఉంటారు.

అయితే చాలా సినిమాలు వేరే భాషల్లో లోనివి తెలుగులో చాలా పెద్ద హిట్ అయ్యాయి. ఓటిటి వచ్చిన తర్వాత భాషతో సంబంధం లేకుండా ప్రతి సినిమాను కూడా తెలుగు ప్రేక్షకులు చూసి, దానిపైన తమ ఒపీనియన్ ని పోస్ట్ చేస్తూ, ఆ సినిమా గురించి పదిమందికి చెప్పడం మనకు అలవాటు. అలా ఇతర భాషల్లో మన సినిమా గురించి మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. కానీ మన తెలుగు వాళ్ళు మాత్రం ఇతర భాషలో వచ్చిన గొప్ప సినిమాలు గురించి మాట్లాడుతూనే ఉంటారు ఎందుకంటే తెలుగు వాళ్ళకి సినిమా అనేది ఒక బేసిక్ ఎమోషన్ కాబట్టి.

ప్రతివారం కొన్ని సినిమాలు థియేటర్లో వచ్చి వచ్చినట్టే వెళ్లిపోతాయి. ఇంకొన్ని సినిమాలు మనల్ని వెంటాడుతాయి. ఆ సినిమాల్ని మనం ఎంతగానో ఓన్ చేసుకుంటాం. ఇకపోతే ఈ మధ్యకాలంలో మలయాళం ఇండస్ట్రీ నుంచి అద్భుతమైన సినిమాలు వచ్చాయి గత మూడు వారాల్లో వారానికొక అద్భుతమైన సినిమా మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి రిలీజ్ అయింది. దానికి తెలుగు ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పట్టారు.

- Advertisement -

ఫిబ్రవరి 9వ తారీఖున ప్రేమలు అనే సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా చాలామంది తెలుగు వాళ్ళకి కూడా కనెక్ట్ అయింది. ఆ సినిమాని చాలామంది వేరే వాళ్లకు సజెస్ట్ కూడా చేశారు. అలానే ఫిబ్రవరి 15వ తారీఖున భ్రమయుగమని సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా చాలామందిని ఆకట్టుకుంది. ఇకపోతే రీసెంట్ గా మంజుమ్మల్ బాయ్స్ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా మంచి ఆదరణ పొందుతుంది. ఈ మూడు సినిమాలు ఒకే జోనర్ కాకపోయినా దేనికవే ప్రత్యేకం అని చెప్పొచ్చు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు