Bigg Boss Season7: మోస్ట్ ఇరిటేటింగ్ ఫెలో భోలే – ఎక్కడ దొరికాడు బిగ్ బాస్..!

బిగ్ బాస్ సీజన్ 7 రోజులు గడుస్తున్న కొద్దీ  ఇంట్రస్టింగ్ గా సాగుతోంది. ఎప్పుడూ లేని విధంగా ఈ సారి ఏకంగా 5మంది కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్ లోకి పంపాడు బిగ్ బాస్. కొత్త హౌస్ మేట్స్ ఎంట్రీతో షో మరింత ఆసక్తిగా మారింది. అయితే, కొత్త కంటెస్టెంట్స్ లో ఒకడైన భోలే శావళి మాత్రం కాస్త తేడాగా ఉన్నాడు.

ప్రతి విషయానికి అతిగా రియాక్ట్ అవ్వడం, అతి వినయం ప్రదర్శించటం పట్ల ఆడియెన్స్ లో నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతోంది. అంతే కాకుండా ఇప్పటిదాకా ఫిజికల్ టాస్క్స్ లో పెద్దగా పర్ఫామ్ చేయలేదు భోలే. రైతు బిడ్డ ప్రశాంత్ కి బయట ఉన్న క్రేజ్ ని వాడుకోవాలనే ఇంటెన్షన్ తో పాట బిడ్డని అంటూ తనకి తాను ట్యాగ్ ఇచ్చుకొని హౌస్ లోకి ఎంటరయ్యాడు భోలే.

హౌస్ లోకి ఎంటరైనప్పటి నుండి ప్రశాంత్ భజన చేయడం, శివాజీని అన్నగారు అంటూ పిలుస్తూ అతి వినయం ప్రదర్శించటంతో ఫస్ట్ డే నుండే ట్రోలర్స్ కి స్టఫ్ గా మారాడు భోలే. భోలే బిహేవియర్ చాలా ఇరిటేటింగ్ గా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. గత సీజన్స్ లో ఏ కంటెస్టెంట్స్ కి కూడా ఎంటరైన ఫస్ట్ డే నుండే ఇంతటి నెగిటివిటి క్రియేట్ అవ్వలేదు.

- Advertisement -

కొత్తగా ఎంటరైన హౌస్ మేట్స్ లో అర్జున్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అనిపిస్తుండగా, పూజ మెచ్యూర్డ్ గా అనిపిస్తోంది. నయని పవని కూడా నామినేషన్స్ సమయంలో తన వాయిస్ గట్టిగ వినిపిస్తూ టాస్క్స్ లో యాక్టివ్ గా ఉంటోంది. అశ్విని మాత్రం కన్ఫ్యూజ్డ్ గా ఉంటూ మెంటల్లీ వీక్ గా అనిపిస్తోంది. మరి, ఈ వారం హౌస్ నుండి కొత్త కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతారా లేక ఓల్డ్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతారా అన్నది చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు