Pawan Kalyan : నీకు నేను నాకు నువ్వు

సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనే నిజాన్ని,
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ను పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు.
వరుస ప్లాప్స్ పడినా పవర్ స్టార్ క్రేజ్ , రెమ్యునరేషన్ పెరిగిందే తప్ప ఏ మాత్రం తగ్గలేదు. మూస ధోరణిలో సాగిపోతున్న తెలుగు సినిమాలోని హిందీ పాటలను జోడించి మరి హిట్ కొట్టిన ఘనత పవన్ కళ్యాణ్ ది.
యూత్ లో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలబడటం ఆయనకు మాత్రమే చెల్లింది. హిట్ ప్లాప్ కి అతీతమైన ఇమేజ్ కళ్యాణ్ ది.

వరుస ప్లాప్స్ సతమతమవుతున్న నితిన్ కెరియర్ లో బిగ్గెస్ట్ కంబ్యాక్ హిట్ అంటే ఇష్క్ మూవీ అని చెప్పొచ్చు. నితిన్ ఇష్క్ సినిమా ఆడియో లాంచ్ కి పవన్ కళ్యాణ్ గెస్ట్ గా రావడం. నితిన్ ఆ వేడుకలో పవన్ కళ్యాణ్ పై ఉన్న ఇష్టాన్ని చెప్పడం వలన పవన్ కళ్యాణ్ అభిమానులు నితిన్ ను ఓన్ చేసుకున్నారు ఇష్క్ సినిమాకి ఊహించని విజయాన్ని చేసి మళ్ళీ నితిన్ ను హిట్ ట్రాక్ లో నిలబెట్టిన ఘనత పవన్ ఫ్యాన్స్ ది అని చెప్పొచ్చు.

పవన్ పొలిటికల్ ఎంట్రీ తరువాత కొంచెం గ్యాప్ ఇచ్చి వరుస సినిమాలను అనౌన్స్ చేసారు. వాటిలో వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు వరుస విజయాలను సాధించాయి. ఈ మధ్య జరిగిన అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె షో లో కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. మొదటి భీమ్లా నాయక్ లో భీమ్లా నాయక్ రోల్ ను బాలయ్య చెయ్యాలి. కానీ ఈ రోల్ పవన్ కళ్యాణ్ చేస్తే బాగుంటుంది అని చెప్పడంతో ఆ రోల్ కళ్యాణ్ వద్దకు చేరింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ సినిమా నిర్మాత నాగవంశీ చెప్పడం విశేషం. ఈ విషయం పవన్ కళ్యాణ్ అభిమానులకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చి బాలయ్య పై రెస్పెక్ట్ ను పెంచింది.

- Advertisement -

ఇక తాజాగా బాలయ్య చేస్తున్న టాక్ షో కి పవన్ హాజరు కాబోతున్న విషయం తెలిసిందే. రీసెంట్ వీర సింహారెడ్డి సెట్ లో పవన్ బాలయ్య ను కూడా కలిశారు. ఇంతే కాకుండా బాలయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరవుతారు అని తెలుస్తోంది. ఇకపోతే తాను సినిమా చేయబోయే నిర్మాణ సంస్థ కాబట్టి పవన్ హాజరయ్యా అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మొత్తానికి ఈ ఇద్దరు హీరోలు నీకు నేను నాకు నువ్వు అనే విధంగా తమ ప్లానింగ్స్ చేసుకుంటున్నారు.

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు