Unstoppable : అగ్ర హీరోలతో భారీ మల్టీస్టారర్

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అంత్యంత సక్సెస్ ఫుల్ గా సాగిపోతున్న సెలబ్రిటీ టాక్ షో లో బాలయ్య ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్ బి కే’.తెలుగు OTTలో 40 కోట్ల స్ట్రీమింగ్ నిమిషాలతో అత్యధికంగా వీక్షించబడిన షో. ఆహా లో స్ట్రీమ్ అవుతున్న ఈ టాక్ షో సీజన్ 1కు మంచి ఆదరణ లభించడంతో సీజన్ 2 ని భారీ స్థాయిలో ప్రారంభించింది. ప్రతీ వారం ఒక కొత్త సర్ప్రైజ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. బాల్లయ్య పంచ్ డైలాగ్లు, కుర్ర హీరోల కొంటె చేష్టలతో అన్ స్టాపబుల్ గా దూసుకెల్తుంది.
90 ఇయర్స్ అఫ్ తెలుగు ఇండస్ట్రీ సందర్బంగా ఈ వారం అల్లు అరవింద్, సురేష్ బాబు స్టార్ డైరెక్టర్స్ రాఘవేంద్ర రావు, కోదండ రామిరెడ్డి సందడి చేయబోతున్నారు.

తాజాగా 5వ ఎపిసోడ్ ప్రోమో ను రిలీజ్ చేసారు.ఈ ప్రోమో ఆధ్యంతం అన్ స్టాపబుల్ ఫ్యాన్స్ ను అలరింపచేస్తుంది. బాల కృష్ణ, అల్లు అరవింద్ మధ్య సంభాషణ పలువురిని ఆకట్టుకుంటుంది. బాల్లయ్య అల్లు అరవింద్ తో “మన ఇద్దరి కాంబినేషన్ లో సినిమా బ్యాలన్స్ ఉంది ……” అని అనగా “మీరు చిరంజివి కాంబినేషన్ లో సినిమా తీద్దాం అని వెయిట్ చేస్తున్నా” అంటూ బదులు ఇచ్చారు అల్లు అరవింద్.అది పాన్ వరల్డ్ సినిమా అవుతుందంటూ బాల్లయ్య ఆనందం వ్యక్తం చేసారు.

మెగా స్టార్ చిరంజీవి, బాల కృష్ణ మధ్య ఉన్న సంబంధం గురించి ఎన్ని విమర్శలు వచ్చిన అవి నిజం కాదంటూ ఎప్పటికప్పుడు చూపిస్తూ వస్తున్నారు. ఇంకా వీరిఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే అటు మెగా ఫ్యాన్స్ ఇటు నందమూరి అభిమానులకు పండుగే. వీరిద్దరి సినిమా కోసం వారి ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా వేచి చూస్తారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు