ఓవైపు సపోర్టింగ్ రోల్స్, విలన్ పాత్రలు చేస్తూనే మరోవైపు హీరోగా నటిస్తున్నాడు నవీన్ చంద్ర. తనలో ఉన్న విలక్షణ నటనను ప్రేక్షకుల ముందు ప్రదర్శిస్తున్నారు. నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్న తాజా చిత్రం తగ్గేదేలే. దివ్య పిళ్లై హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి దండుపాళ్యం ఫేమ్ శ్రీనివాసరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలైంది.
ఈ ట్రైలర్లో చూసినట్టయితే పేషెంట్ బాడీలో ఉన్న బుల్లెట్‌ని తీస్తుండగా ప్రారంభం అవుతుంది. పోలీసులకు హీరో నవీన్ చంద్ర ఫోన్ చేస్తాడు. “ఆ అమ్మాయి ఎవరు.? నువ్వు ఎవరు..? నీకు ఆ అమ్మాయికి ఉన్న సంబంధం ఏంటి” అని పోలీసులు విచారిస్తుంటారు. ఈ ట్రైలర్ తో ఈ సినిమా ప్రేమ, సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. “నిన్ను చూస్తుంటే నక్సలైట్‌గా కూడా లేవు. కొంపతీసి సీరియల్ కిల్లర్ వా ఏంటి” అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది.
నవీన్ చంద్రను పోలీసులు ఓ రహస్య ప్రాంతానికి తీసుకెళ్లడంతో.. “నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు. ఎన్కౌంటర్ చేస్తారా” అనే డైలాగ్ సస్పెన్స్ ను క్రియేట్ చేస్తుంది. అందులో విలన్ చాలా మందిని కాల్చి చంపడం సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. ఈ చిత్రంలో దండుపాళ్యం లో కనిపించిన డేంజరేస్ పూజాగాంధీ బ్యాచ్ కూడా ఈ సినిమాలో కనిపిస్తుంది. ఇందులో పూజా గాంధీ చేసే ఫైట్ ఆకట్టుకుంటుంది. మొత్తంగా ఈ ట్రైలర్ తో.. సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగుతుందని అర్థమవుతుంది. దండుపాళ్యం గ్యాంగ్ సినిమాకు హైలైట్ ఉండే అవకాశాలు ఉన్నాయి.