Kantara : సక్సెస్ టూర్

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ‘కాంతార’ సినిమా గురించి ప్ర‌తీ ఒక్క‌రూ చ‌ర్చించుకుంటున్నారు. తొలుత సెప్టెంబ‌ర్ 30న క‌న్న‌డ‌లో విడుద‌లైన కాంతార చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది. ఈ సినిమా తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో కూడా విడుద‌ల చేశారు. అన్ని భాష‌ల్లో కూడా సూప‌ర్ హిట్ గా నిలిచింది కాంతార సినిమా.

తెలుగులో అక్టోబ‌ర్ 15న విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది. అల్లు అర‌వింద్ గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై విడుద‌ల చేశారు. ఈ చిత్రం విజ‌య‌వంతంగా ఆడుతున్న త‌రుణంలో ప్రేక్ష‌కుల‌ను నేరుగా క‌లిసేందుకు చిత్ర యూనిట్ స‌క్సెస్ టూర్ నిర్వ‌హించ‌నున్న‌ది. అక్టోబ‌ర్ 29న తిరుప‌తి, విజ‌య‌వాడ‌, వైజాగ్‌లోని కాంతార చిత్రం ప్ర‌ద‌ర్శించ‌బ‌డుతున్న థియేట‌ర్ల‌ని సంద‌ర్శించి ప్రేక్ష‌కుల‌ను క‌లవ‌నున్నారు. ఈ స‌క్సెస్ టూర్‌లో చిత్ర ద‌ర్శ‌కుడు, హీరో రిష‌బ్ శెట్టి, నిర్మాత పాల్గొన‌నున్నారు.

మ‌రోవైపు ఈ చిత్రం 12 రోజుల బాక్సాఫీస్ క‌లెక్ష‌న్లు తెలంగాణ‌లో రూ.7.32 కోట్ల షేర్‌, రాయ‌ల‌సీమ‌లో రూ.2.06 కోట్ల షేర్, ఉత్త‌రాంధ్ర రూ.2.14 కోట్ల షేర్‌, ఈస్ట్ గోదావ‌రి రూ.1.30 కోట్లు, వెస్ట్ గోదావ‌రి రూ.0.84 కోట్లు, గుంటూరు రూ.1.09 కోట్లు, కృష్ణా రూ.1.09, నెల్లూరు రూ.0.67 కోట్లు, మొత్తానికి తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ క‌లిపి రూ.29.85 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసిన‌ట్టు తెలుస్తోంది.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు