Rajinikanth Coolie Teaser : దీనికి కారణం… అనుభవంలో నుంచి వచ్చిన గుణపాఠమేనా…?

Rajinikanth Coolie Teaser : నిన్న సాయంత్రం (సోమవారం) రజినీకాంత్ – లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తున్న తలైవార్ 171 మూవీ టైటిల్‌ను రివీల్ చేశారు. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీకి కూలీ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. టైటిల్ వరకు సూపర్ స్టార్ ఫ్యాన్స్ సూపర్ అని చెప్పినా… అసలైన టీజర్ విషయంలోనే ఫ్యాన్స్ అసంత్రుప్తిగా ఉన్నారు.

కూలీ మూవీ టీజర్‌ అభిమానులు అంచనా వేసినట్టు ఎక్కడా కనిపించలేదు. రజినీకాంత్ అంటేనే… స్టైల్, స్వాగ్ కు పెట్టింది పేరు. కానీ, టీజర్‌లో ఇవేవీ కూడా పెద్దగా ఇంప్రెస్ చేసేలా లేవు. అంతే కాదు… లోకి మూవీ టీజర్ అంటేనే బీభత్సంగా ఉంటుంది. గతంలో లోకి నుంచి వచ్చిన ఖైదీ, విక్రమ్, లియో టీజర్‌లు ఎలా ఉన్నాయో ఇప్పటికే మనం చూశాం. హీరోకు కావాల్సినంత ఎలివేషన్స్ అన్ని టీజర్‌లోనే ఇచ్చేవాడు. కానీ, అలాంటిది ఇప్పుడు కూలీ టీజర్‌లో మిస్ అయింది.

అయితే దీనికి ఓ రీజన్ ఉందని అంటున్నారు లోకేష్ అభిమానులు. విజయ్ దళపతి లియో టైంలో జరిగింది గుర్తు చేస్తున్నారు. లియో టీజర్‌తో మంచి బజ్ క్రియేట్ అయింది. విక్రమ్ కంటే ఓ రేంజ్‌లో మూవీ ఉంటుందని అందరూ అనుకునేంతగా టీజర్ ఉంది. కానీ, మూవీ నిరాశ పరిచింది. టీజర్‌తో అంత హైప్ రాకుంటే మూవీ బాగానే అనిపించేదని, కానీ, టీజర్‌తో వచ్చిన హైప్‌‌ను అందుకోవడంలో మూవీ ఫెయిల్ అయింది అనేది అప్పుడు క్రిటిక్స్ నుంచి వచ్చిన టాక్.

- Advertisement -

ఈ విషయాన్ని డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కూడా ఓ టైంలో అన్నాడు. సినిమా బాగానే ఉన్నా… ఫ్యాన్స్ అంచనాలను అందుకోవడం లేదు అని చెప్పాడు. అప్పుడు వచ్చిన గుణపాఠంతో ఇప్పుడు కూలీ సినిమాకు ముందు జాగ్రత్తగా ఉంటున్నాడని అర్థమవుతుంది.

టీజర్‌తోనే మొత్తం హైప్ ఇవ్వకుండా… తర్వాత వచ్చే అప్డేట్స్‌తో సినిమాపై బజ్ క్రియేట్ చేయాలని చూస్తున్నాడని అంటున్నారు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి కావాల్సినది అంతా కూడా ట్రైలర్‌లోనే ఉండేలా లోకి ప్లాన్ చేస్తున్నారట. అప్పటి వరకు ఎన్ని అప్‌డేట్స్ వచ్చినా, ట్రైలర్‌లోనే రజినీకాంత్ మార్క్ స్టైల్, స్వాగ్ కనిపించేలా చేసి అప్పుడే సినిమాపై హైప్ క్రియేట్ చేస్తాడని అంటున్నారు.

నిజానికి లియో సినిమా బాగున్నా… టీజర్‌తో వచ్చిన హైప్ ను అందుకోవడంలో విఫలం అవ్వడంతో చాలా ట్రోల్స్ వచ్చాయి. డిజాస్టర్ మూవీ అంటూ కూడా కామెంట్స్ చేశారు. మళ్లీ ఆ… తప్పు జరగ కూడదని లోకి ఇలా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు ఆయన ఫ్యాన్స్. చూడాలి మరి ట్రైలర్‌లో రజినీకాంత్ ను ఎలా చూపిస్తాడో… సినిమా ఎలా ఉండబోతుందో…

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు