Tejaswi madivada: నా నగ్న ఫోటోలు బయట పెట్టింది అతడే..!

Tejaswi madivada.. తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదట ఎన్నో చిత్రాలలో పలు పాత్రలలో నటించి మెప్పించింది నటి తేజస్వి మదివాడ.. తెలుగమ్మాయి అయినప్పటికీ కూడా.. స్టార్ హీరోల చిత్రాలలో బాగానే అవకాశాలు అందుకుంది. ఆ తర్వాత హీరోయిన్ గా కూడా చిన్న చిన్న చిత్రాలలో నటించినా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. ఆ తరువాత బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి బాగానే గుర్తింపు సంపాదించుకుంది తేజస్వి మదివాడ. ఆ తర్వాత కొన్నేళ్ళకు ఫేడౌట్ అవ్వడంతో అవకాశాలు కూడా రాలేదు. దీంతో అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది.

Tejaswi madivada: He is the one who published my nude photos..!
Tejaswi madivada: He is the one who published my nude photos..!

నా న్యూడ్ ఫోటో వర్మ వల్లే బయటకు వచ్చింది.

తాజాగా ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజస్వి.. తన సినీ కెరియర్ నాశనం కావడానికి పలు రకాల విషయాలను కూడా రివీల్ చేయడం జరిగింది. తేజస్వి మదివాడ మాట్లాడుతూ..”తన కెరియర్లో చాలా శృంగార సన్నివేశాలు బోల్డ్ సన్నివేశాలలో ఎక్కువగా నటించాను.. ముఖ్యంగా వర్మ తెరకెక్కించిన ఐస్ క్రీమ్ సినిమాలో నేను నటించేటప్పుడు ఒక న్యూడ్ ఫోటో బయటికి రావడం జరిగింది అంటూ వెల్లడించింది. అయితే ఆ ఫోటో దాదాపుగా పదేళ్ల తర్వాత వైరల్ కావడంతో అప్పుడెప్పుడో నటించిన ఈ సన్నివేశం ప్రస్తుతమున్న పరిస్థితులలో రాంగ్ గా ప్రజెంటేషన్ అయ్యింది..అయితే ఆ ఫోటోలో కాస్త అశ్లీలత ఎక్కువగా వర్మ చూపించారు.. ఇలాంటి వాటిని సెన్సార్ బోర్డు కూడా నియంత్రించింది అంటూ తెలిపింది. అందుకే సినిమాలలో న్యూడ్ సన్నివేశాలు పెట్టడానికి అవకాశం ఉండదు కాబట్టి అలా చేశారని తెలిపింది. వర్మ రిలీజ్ చేసిన ఒక న్యూడ్ ఫోటో కారణంగా అలాగే ఈ ఫోటోల వల్ల వచ్చినటువంటి రూమర్స్ వల్ల తన కెరియర్ పైన చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది అంటూ తెలుపుతోంది తేజస్వి మదివాడ.

వర్మ వల్లే తేజస్వి జీవితం నాశనం..

అప్పటివరకు తెలుగమ్మాయిగా పక్కింటి అమ్మాయిగా ఉన్నటువంటి ఇమేజ్ ని సైతం ఆ ఒక్క ఫోటో చాలా దెబ్బతీసింది అని తెలుపుతోంది. దీనివల్ల రాత్రికి రాత్రే హీరోయిన్ గా ఉన్న నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పడిపోయానని ఎమోషనల్ గా తెలియజేస్తోంది. ప్రస్తుతం తేజస్వి చేసినటువంటి ఈ కామెంట్స్ సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే అభిమానులు మాత్రం ఈమె కెరియర్ ఇలా అవ్వడానికి ముఖ్య కారణం వర్మనే అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

రాంగోపాల్ వర్మ కెరియర్..

ఒకప్పుడు క్షణం క్షణం, శివ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేసి భారీ క్రేజ్ దక్కించుకున్న వర్మ.. ఆ తర్వాత అడల్ట్ చిత్రాలు తీస్తూ ప్రేక్షకులలో విపరీతమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నారు.. మధ్య మధ్యలో రక్త చరిత్ర వంటి చిత్రాలను తెరకెక్కిస్తూ రాజకీయంగా అద్దం పట్టిన ఈయన ఇప్పుడు మళ్లీ వ్యూహం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే..ప్రస్తుత రాజకీయ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తీసిన ఈ సినిమా రాజకీయంగా ఎలాంటి విమర్శలు, ప్రశంసలు అందుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు