BigBoss7: ఫోకస్ దానిపై పెడితే సినిమా టైం కి వస్తుందా?

Bigboss7:

టాలీవుడ్ లో టాప్ హీరోల కంటే సీనియర్ స్టార్ హీరోలే ఎక్కువగా సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ లో ఉన్నారు. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ తో పాటు రవితేజ కూడా రెండేసి సినిమాలతో బిజీగా ఉన్నారు, ఒక్క నాగార్జున తప్ప. లాస్ట్ ఇయర్ ఘోస్ట్ సినిమాతో పలకరించిన నాగ్ ఈ ఇయర్ ఒక్క సినిమా కూడా చేయలేదు. అదీ గాక గత కొన్నాళ్లుగా అక్కినేని ఫ్యామిలీ హీరోలు చేసిన ఏ సినిమా కూడా సరిగా ఆడకపోవడంతో, ఫ్యామిలీ పరువు కాపాడాల్సిన పరిస్థితి నాగార్జున పై పడింది.

అందుకే కాస్త గ్యాప్ తీసుకున్న ఆయన ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఒక మాస్ సినిమాతో రానున్నాడు. విజయ్ బిన్నీ దర్శకత్వంలో నాగార్జున “నా సామి రంగ” అనే సినిమాతో ప్రేక్షకులని మెప్పించడానికి రెడీ అవుతున్నాడు. తాజాగా నాగార్జున బర్త్ డే కానుకగా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే ఆగష్టు నెలలో షూటింగ్ స్టార్ట్ అయిన ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. కేవలం 4నెలల్లో సినిమా ఫినిష్ చేయడమంటే మాటలు కాదు. అన్ని పక్కన పెట్టి సినిమాపైనే ఫుల్ ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది.

అయితే తాజాగా బిగ్ బాస్ సీజన్ 7 వస్తుండడంతో దానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున ఆ షో పై ఫుల్ ఫోకస్ పెట్టాడని తెలుస్తుంది. అయితే దానివల్ల ఈ సినిమా షూటింగ్ కి ఎఫెక్ట్ పడుతుందని చిత్ర యూనిట్ నుండి సమాచారం. నా సామి రంగ సినిమా ఆగష్టు లో చిత్రీకరణ ప్రారంభమవగా, కనీసం 20 శాతం షూటింగ్ కూడా కంప్లీట్ కాలేదు. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ పై ఫోకస్ తో సినిమాకి షూటింగ్ కి గ్యాప్ ఇస్తే సంక్రాంతికి రావడం కష్టమే అని అనిపిస్తుంది. మరి నాగార్జున ఈ అటు బిగ్ బాస్ షోకి సినిమాకి డేట్స్ ఎలా అడ్జస్ట్ చేస్తాడో చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings,

and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు