Skanda First day Collections: ఓపెనింగ్స్ ఓకే… కానీ, ఫుల్ లెన్త్ పరిస్థితి ఏంటో?

Skanda First day Collections

బోయపాటి శ్రీను సినిమాలు… మాస్ సినిమాలకు కేరాఫ్ ఆడ్రస్ ఆయన. బోయపాటి కెరీర్‌లో వినయ విధేయ రామ లాంటి డిజాస్టార్లు ఉన్నాయి. లెజెండ్, అఖండ లాంటి హిట్స్ ఉన్నాయి. అయితే బోయపాటి శ్రీను సినిమాలు కేవలం బాలయ్యకే సెట్ అవుతాయని.. బాలయ్యతో కాకుండా ఏ హీరోతో సినిమాలు చేసినా అవి ఫ్లాప్.. డిజాస్టార్లు అవుతాయనే ఒక టాక్ ఉంది. జయ జానకి నాయక, వినయ విధేయ రామ లాంటి సినిమాలు వచ్చిన తర్వాత అందరూ అదే అనుకున్నారు.

కానీ, బాలయ్యతో చేసిన అఖండ బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత బోయపాటిపై ఇతర హీరోలు మరోసారి ఇంట్రెస్ట్ చూపించారు. అలా వచ్చేందే స్కంద. రామ్ పోతినేని హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా వచ్చిన ఈ చిత్రం 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బోయపాటి సినిమాలు ఎలా ఉంటాయో… స్కంద కూడా అలాగే ఉంది.

ఒక సింహా, లెజెండ్, అఖండ సినిమాల్లో ఉండే వైలెన్స్ పోలికలు స్కందలో స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే వినయ విధేయ రామలో అతి కూడా స్కందలో కనిపిస్తుంది. నిజానికి బోయపాటి సినిమాకి వెళ్తున్నప్పుడు వీటికి ప్రిపేర్ అయ్యే వెళ్లాలి. ఆయన సినిమాలో వైలెన్స్… అతి కాకుండా, రొమాన్స్, లవ్ స్టోరీ ఉండదని అందరికీ తెలిసిందే.

- Advertisement -

అందుకే స్కంద మూవీ ఒక వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి. రామ్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన మూవీగా స్కంద నిలిచింది. తొలి రోజు అన్ని ప్రాంతాల్లో కలిపి 18.2 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో షేర్ విషయానికి వస్తే… 8.62 కోట్లు వచ్చాయి.

అత్యధికంగా.. నైజం ఏరియాలో… 3.23 కోట్లు వచ్చాయి.
అలాగే సీడెడ్ – 1.22 కోట్లు
వైజాగ్ – 1.19 కోట్లు
గుంటూరు – 1.04 కోట్లు
ఈస్ట్ – 0.59 కోట్లు
వెస్ట్ – 0.41 కోట్లు
నెల్లూరు – 0.49 కోట్లు
క్రిష్ణ – 0.45 కోట్లు
కలెక్ట్ చేసింది.

అయితే స్కంద ఒక వర్గం ప్రేక్షకులకు మాత్రమే నచ్చింది అనేది నిజం. అందు వల్లే ఫస్ట్ డే 18 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. కానీ, ఇది వీకెండ్ వరకు కొనసాగుతుందా? ఒక వేళ వీకెండ్ వరకు కొనసాగినా, తర్వాత పరిస్థితి ఏంటి అనే డౌట్ మాత్రం ఉంది. ఇప్పుడు ఉన్న టాక్ ఇలాగే ఉంటే స్కంద బ్రేక్ ఈవెన్ పాయింట్ క్రాస్ అవ్వడం పెద్ద కష్టమేమీ కాదు.

Grab Filmify for the latest web stories on Celebrities, today’s Tollywood news, the latest images of actors & actresses, new movie ratings & reviews, and the latest entertainment news from all Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు