Personality Development : డిసిప్లిన్… ఇదొక్కటి ఉంటే లైఫ్ లో ఎన్ని సాధించవచ్చో తెలుసా?

Personality Development : ఏదైనా పనిని చేయడానికి కమిట్ అయినప్పుడు ఎన్నో అడ్డంకులు, ప్రలోభాలు ఎదురవుతూ ఉంటాయి. దీంతో ఆ పనిని మధ్యలోనే ఆపేస్తూ ఉంటారు చాలామంది. కానీ సంకల్ప బలంతో ముందుకు సాగుతూ అనుకున్న పనిని విజయవంతంగా పూర్తి చేయడమే క్రమశిక్షణ. ఇదే లైఫ్ లో సక్సెస్ ను అందుకోవడానికి కీ సక్సెస్ మంత్ర. ఎలాంటి పనిలోనైనా సరే విజయం సాధించాలంటే క్రమశిక్షణ అత్యవసరం. ఇది జీవితంలోని ప్రతి అంశానికి వర్తిస్తుంది. కెరీర్, రిలేషన్ షిప్, వ్యక్తిగత ఎదుగుదల నుంచి కలలను సాకారం చేసుకోవడం వరకు ప్రతి విషయంలోనూ క్రమశిక్షణ కీలకపాత్రను పోషిస్తుంది. మరి డిసిప్లిన్ ఉంటే లైఫ్ లో ఎన్ని విధాలుగా సక్సెస్ సాధించొచ్చో ఇప్పుడు చూద్దాం.

1. గోల్ సెట్టింగ్ లో డిసిప్లిన్

Personality Development : Discipline... Do you know how much you can achieve in life if you have this one?
విజయానికి మొదటి అడుగు స్పష్టమైన లక్ష్యాలను నిర్వచించడం. క్రిస్టల్ క్లియర్ గోల్స్ ఉన్నప్పుడే వాటికి సరైన దిశ, ప్రోత్సాహం, క్రమశిక్షణను అప్లై చేస్తూ సక్సెస్ ను సాధించగలం. ఒక్కసారి గోల్ సెట్ చేసుకున్నామంటే ఆ తర్వాత క్రమశిక్షణ వాటిని కార్యరూపం దాల్చేలా చేస్తుంది. దృష్టి వేరే వైపు మరలకుండా లక్ష్యాన్ని సాధించే మీ ప్లాన్ కు మీరు కట్టుబడి ఉండేలా చేస్తుంది డిసిప్లిన్.

- Advertisement -

2. టైం మేనేజ్మెంట్ లో డిసిప్లిన్

Personality Development : Discipline... Do you know how much you can achieve in life if you have this one?
సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి క్రమశిక్షణ అవసరం. ఈ డిజిటల్ యుగంలో మనం నిరంతరం పరధ్యానంలో పడిపోతూ ఉంటాం. ఎక్కువగా ఫోన్లు చూడడం, ముఖ్యంగా సోషల్ మీడియాపై దృష్టి మళ్లడం వంటి వాటి వల్ల ప్రొడక్టివిటీ దెబ్బతింటుంది. ఇలాంటి అనవసరమైన పనులపై ఎక్కువ సమయం వేస్ట్ చేయకుండా ఉండడానికి డిసిప్లిన్ ఉపయోగపడుతుంది. ఏ సమయానికి ఏం చేయాలన్న విషయాలను ముందుగానే ప్లాన్ చేసుకుని, షెడ్యూల్ ప్రకారం క్రమశిక్షణతో సమయాన్ని వినియోగించుకోవడం వల్ల అనుకున్న సమయానికే మీ పనిని పూర్తి చేయగలుగుతారు.

3. స్కిల్ డెవలప్మెంట్ లో డిసిప్లిన్

Personality Development : Discipline... Do you know how much you can achieve in life if you have this one?
లైఫ్ లో సక్సెస్ ఫుల్ గా ఎదగాలి అంటే నిరంతరం స్కిల్స్ ను అప్ గ్రేడ్ చేసుకోవడం చాలా ముఖ్యం. వృత్తిపరమైన అర్హతలు, సాంకేతిక నైపుణ్యం, అద్భుతమైన కమ్యూనికేషన్స్ ఉన్నప్పటికీ అత్యంత వేగంగా పరుగులు తీస్తున్న ఈ ప్రపంచంలో నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. కాబట్టి సమయం దొరికినప్పుడల్లా కొత్త విషయాలను నేర్చుకుంటే అవి ఎదుగుదలకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది.

4. సవాళ్లను అధిగమించడంలో క్రమశిక్షణ

Personality Development : Discipline... Do you know how much you can achieve in life if you have this one?
ఏదైనా పెద్ద చాలెంజ్ ఎదురైనప్పుడు భయం, నిరాశ వంటి ఎమోషన్స్ చేస్తున్న పనిపై ఫోకస్ తగ్గేలా చేస్తాయి. కష్టంగా అనిపించినప్పుడు చేయాల్సిన పనిని మధ్యలోనే వదిలేస్తూ ఉంటాం. ఇలాంటి సమయంలోనే సవాళ్లను ఎదుర్కోవడానికి క్రమశిక్షణ అవసరం. దానివల్ల ప్రతికూల భావోద్వేగాలను నియంత్రిస్తూ, పనిపై ఫోకస్ చేసే శక్తి లభిస్తుంది. ఇంకా హెల్త్, రిలేషన్షిప్ లలో కూడా క్రమశిక్షణ కీలకపాత్ర పోషిస్తుంది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు