Aamir Khan: ప్లాప్ సినిమా నయా రికార్డు

బాలీవుడ్ కు ప్రస్తుతం రోజులు కలిసిరావడం లేదు. వచ్చిన ప్రతి సినిమా.. ఓ వివాదంలో చిక్కుకోవడం, బాక్సాఫీస్ ముందు బొక్కబోర్లపడటం, నిర్మాతలకు భారీ నష్టాలు రావడం ఇదే జరుగుతుంది. గత కొద్ది రోజుల నుంచి బాలీవుడ్ ను గమనిస్తే.. “ది కశ్మీర్ ఫైల్స్” “గంగూబాయ్ కతియావాడి” మినహా ఏ ఒక్క సినిమాకు కూడా పాజిటివ్ రివ్యూలు రాలేదు. కలెక్షన్లు కూడా పెద్దగా రాలేదు. ఈ ఆగస్టు నెలలో భారీ అంచనాలతో వచ్చిన “లాల్ సింగ్ చడ్డా” కూడా బాలీవుడ్ తలరాతను మార్చలేకపోయింది.

“థంగ్స్ ఆఫ్ హిందూస్తాన్” డిజాస్టార్ తర్వాత దాదాపు నాలుగేళ్లు గ్యాప్ తీసుకున్న అమీర్ ఖాన్, ఎంతో ప్రతిష్టాత్మికంగా “లాల్ సింగ్ చడ్డా”ను తెరకెక్కించాడు. హాలీవుడ్ సినిమా “ఫారెస్ట్ గంప్” కు అధికారిక రిమేక్ గా లాల్ సింగ్ చడ్డా వచ్చింది. 180 కోట్లా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మూవీ రిలీజ్ కు ముందే ఓ వివాదంలో చిక్కుకుంది. దీంతో “బాయ్ కాట్ లాల్ సింగ్ చడ్డా” ని ఎదుర్కొని రిలీజ్ అయింది. కానీ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లపడింది. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ సినిమా ఎక్కడ కూడా పెద్దగా ఆడలేదు.

అయితే ఈ సినిమా తాజాగా ఓ రికార్డును నమోదు చేసింది. ఈ ఏడాది ఏ హిందీ సినిమా అందుకోలేని ఘనతను లాల్ సింగ్ చడ్డా అందుకుంది. విదేశాల్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హిందీ సినిమాగా అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా రికార్డు క్రియేట్ చేసింది. ఓవర్సీస్ లో ఇప్పటి వరకు 7.5 మిలియన్ డాలర్లు (126 కోట్లు) వసూళ్లు చేసింది. దీని తర్వాత స్థానంలో 7.47 మిలియన్ డాలర్లతో “గంగూబాయి కతియావాడి”, 5.88 మిలియన్ డాలర్లతో “భూల్ భూలయ్యా 2” ఉన్నాయి.

- Advertisement -

అయితే లాల్ సింగ్ చడ్డా విదేశీ కలెక్షన్లు ఇలా ఉంటే, మన దేశంలో మాత్రం కేవలం 60 కోట్లను మాత్రమే వసూళ్లు చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు