Bigboss Season 7: ఇక నుండి అమర్ దీప్ టార్గెట్ శివాజీయేనా?

Bigboss Season 7:

స్టార్ మా బిగ్ బాస్ సీజన్ 7 లో రతిక ఎలిమినేషన్ తో బిగ్ బాస్ కొత్త మలుపు తీసుకుంది. అసలు రతిక బదులు టేస్టీ తేజ ఎలిమినేట్ కావాల్సి ఉండగా, అనూహ్య మార్పులతో రతిక ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. అయితే రతిక ఎలిమినేషన్ తర్వాత బిగ్ బాస్ లో పర్సనల్ విభేదాలు పెద్దగా ఉండవని ఆడియన్స్ అనుకున్నారు. కానీ తాజాగా అమర్ దీప్ రూపంలో మళ్ళీ ఈ టాపిక్ తెరపైకి వచ్చింది.

గత కొంత కాలంగా నామినేషన్స్ టైం లో హౌస్ మేట్ అయిన శివాజీ పట్ల అమర్ దీప్ అసహనంగా ఉన్నాడు. కొన్ని కొన్ని సార్లు శివాజీ ప్రశాంత్ ని, యావర్ ని కావాలని వెనకేసుకొస్తూ, తనని పక్కన పెడుతున్నారని బిగ్ బాస్ లో పలుమార్లు వాగ్వాదానికి దిగడం జరిగింది. ఆ టాపిక్ ప్రశాంత్, యావర్ విషయంలో మాత్రమే జరగగా, అమర్ దీప్ కి వేరే వాళ్ళ విషయంలో ఇబ్బంది కలగలేదు. అయితే తాజాగా మళ్ళీ నామినేషన్ల సమయం వచ్చే సరికి శివాజీని నామినేట్ చేస్తూ అమర్ దీప్ ఇదే విషయాన్నీ లాగాడు.

బిగ్ బాస్ ఇచ్చిన బ్యాంకు టాస్క్ లో భాగంగా వాళ్ళకి ఎక్కువ కాయిన్స్ ఇచ్చి, తనకి తక్కువ కాయిన్స్ ఇచ్చారు అని అడగ్గా, వాళ్ళకి న్యాయం జరగలేదని ఇచ్చానని అన్నాడు. అయితే సంచాలక్ గా ఉన్నప్పుడు శివాజీ ఎలాంటి తప్పు చేయలేకున్నా, ఇప్పుడు పవర్ అస్త్ర కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అమర్ దీప్ పాత విషయాలనే తీస్తుండడంతో శివాజీని అమర్ దీప్ గట్టిగా టార్గెట్ చేస్తున్నాడా? ఆట విషయంలో లైట్ తీసుకోలేకపోతున్నాడా? అన్న అనుమానం వస్తుంది. ఏది ఏమైనా యావర్ లాగే అమర్ దీప్ ప్రతి సారి వాయిస్ రేస్ చేస్తున్నాడని అనిపిస్తుంది. తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోతే ఇక మీదట కష్టమే.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు