Bigboss season7: నేను ఎందుకు హౌస్ మేట్ గా అనర్హుడ్ని? – శివాజీ

Bigboss season7:

తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 లో ఈ వారం టాస్క్ లలో ఎలాంటి రచ్చ జరిగిందో తెలిసిందే. ముఖ్యంగా స్మైలింగ్ ఫోటో టాస్క్ లలో గౌతమ్, తేజ ల మధ్య జరిగిన ఆక్సిడెంట్ మాత్రం బాగా వైరల్ అయింది. అది అనుకొని జరిగినా, అనుకోకుండా జరిగినా, తేజ చేసిన ఆ బిహేవియర్ కి నాగార్జున ఫైర్ అయ్యాడు. అయితే అక్కడ జరిగిన తప్పులకు మాత్రం శివాజీ బలి కావాల్సి వచ్చింది. కంటెస్టెంట్స్ ఓట్స్ ప్రకారం నాగార్జున శివాజీ యొక్క పవర్ అస్త్ర ని తీసుకోవడం జరిగింది.

అయితే తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో శివాజీ మాట్లాడుతూ నేనెందుకు హౌస్ మేట్ గా అనర్హుణ్ణి అని ప్రశ్నించాడు. దానికి మెజారిటీ కంటెస్టెంట్స్ అభిప్రాయం ప్రకారం మీరు బయాస్డ్ గా ఉన్నారని వాళ్ళు భావించారని అన్నారు. దానికి శివాజీ నేనెక్కడా బయాస్డ్ గా లేను అని అన్నాడు. అప్పుడే నాగార్జున ఇతర కంటెస్టెంట్స్ లతో ఎందుకు శివాజీ ని ఎందుకు అనర్హులో చెప్పామన్నారు.

దానికి రీసన్ శోభా శెట్టి గాని, సందీప్ లేదా ఇతర కంటెస్టెంట్స్ చెప్పడానికి ట్రై చేస్తున్నా, లాజికల్ గా సింక్ కావడం లేదు. ఓవరాల్ గా ప్రశాంత్ ని, యావర్ ని శివాజీ వెనకేసుకొస్తున్నాడని శోభా చెప్పగా, సపోర్ట్ చేసినా, ఆట ప్రకారం వాళ్ళని నామినేట్ చేసాడుగా అని నాగార్జున బదులిచ్చాడు. చివరగా ఒక్క కారణం అయినా చెప్పమని శోభని, ఇంకా కంటెస్టెంట్స్ ని అడగడం జరిగింది. మరి నాగార్జున ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇస్తారో మరి కొద్ది గంటల్లో తెలుస్తుంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు