Sharvanad : రెండున్న‌ర ఏళ్లు బెడ్ పైనే ఉన్నా..

గ‌త కొద్ది కాలంగా హీరో శ‌ర్వానంద్ కెరీర్‌లో ఒక హిట్ లేకుండా పోయింది. మ‌హానుభావుడు సినిమా త‌రువాత శ‌ర్వానంద్ న‌టించిన సినిమాల‌న్నీ కూడా బాక్సాఫీస్ వ‌ద్ద చ‌తికిల‌బ‌డ్డాయి. వ‌రుస డిజాస్ట‌ర్‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న శ‌ర్వానంద్ ఇటీవ‌ల ఒకే ఒక జీవితం సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. ఈ సినిమా క్లాస్ ఆడియెన్స్ ని మెప్పించిన‌ప్ప‌టికీ మాస్ ఆడియ‌న్స్‌కి మాత్రం ఎక్క‌లేద‌నే చెప్పాలి. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో నడిచే ఈ కథ తల్లి కొడుకుల సెంటిమెంట్ ఆధారంగా కొన‌సాగింది. తాజాగా ఈ యంగ్ హీరో అన్ స్టాపబుల్ సీజన్ కు వెళ్లాడు.

బాల‌య్య నిర్వహింస్తున్న అన్ స్టాప‌బుల్ సీజ‌న్ 2 విజ‌య‌ప‌థంలో దూసుకెళ్తోంది. మొద‌టి ఎపిసోడ్‌కి గెస్ట్‌లుగా నారా చంద్ర‌బాబునాయుడు, లోకేష్ రాగా.. రెండో ఎపిసోడ్‌కి విశ్వ‌క్ సేన్‌, సిద్ధు జొన్న‌లగ‌డ్డ వ‌చ్చారు. మూడో ఎపిసోడ్‌కి యువ హీరోలు శ‌ర్వానంద్‌, అడివిశేష్ వ‌చ్చారు. ఈ హీరోల‌తో బాల‌య్య చేసిన‌ హోస్టింగ్ అదిరిపోయింద‌నే చెప్పాలి. ప్రేక్ష‌కుల‌కు మంచి ఎంట‌ర్‌టైన్ ఇచ్చారు. ఇందులో ప‌లు ప్ర‌శ్న‌లు, రూమ‌ర్స్‌తో పాటు లైఫ్ లో జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌లు చ‌ర్చ‌కు వ‌చ్చాయి.

అందులో భాగంగా..  జాను సినిమా స‌మ‌యంలో ప్లైట్‌లోంచి దూకేశాన‌ని శ‌ర్వానంద్ చెప్పుకొచ్చాడు. ” లైఫ్ ఆఫ్ రామ్ షూటింగ్ కోసం ప్లైట్ నుంచి స్కై డ్రైవింగ్ చేయాలి. శిక్ష‌ణ కూడా తీసుకున్నాను. 15వేల అడుగుల ఎత్తులో ఉన్న‌ప్పుడు దూకాను. పారాచూట్ తెరుచుకోలేదు. కింద‌ప‌డ‌డంతో తీవ్ర గాయాలయ్యాయి. చేతికి రెండు ప్లేట్లు వేసి 24 న‌ట్లు బిగించారు. కాలికి ఒక ప్లేటు వేశారు. కోలుకోవ‌డానికి రెండున్న‌ర ఏళ్లు ప‌ట్టింది” అని శ‌ర్వానంద్ చెప్పుకొచ్చాడు.

- Advertisement -

ఇక ఆట‌లో భాగంగా ద‌గ్గుబాటి రానాకి శ‌ర్వానంద్ ఫోన్ చేయాల్సి వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో బాల‌య్య రానాతో “నువ్వు టాక్ షో ప్రిన్స్‌.. నేను టాక్ షో కింగ్” అని బాల‌య్య చెప్పాడు. “మీరు ఎప్పుడూ కింగే సార్” అంటూ రానా స‌మాధానం ఇచ్చాడు. ఇలా స‌ర‌దాగా బాల‌య్య టాక్ షో కొన‌సాగింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు