Hotstar: ఓటీటీ రారాజుకు డౌన్ ఫాల్ స్టార్ట్..

కరోనా మహమ్మారి తర్వాత నుండి OTT ప్లాట్ ఫార్మ్ లు బాగా వెలుగులోకి వచ్చాయి. ఆ సమయం లో ప్రేక్షకులందరికీ టైంపాస్ అవ్వడానికి ఓటీటీలే బాగా ఉపయోగపడ్డాయి. అన్ని ఓటీటీ ఫ్లాట్ ఫాం లలో హాట్ స్టార్ కాస్త ఇంకా భిన్నంగా ఉండేది. IPL మ్యాచ్ లు HBO షోలు, సినిమాలతో పాటు ఇతర ప్రోగ్రామ్స్ తో ఎక్కువ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో హాట్ స్టార్ తిరుగులేని ఓటీటీ ఫ్లాట్ ఫాం అయింది.

చాలా రోజులు పాటు ఓటీటీ ప్రపంచాన్ని రూల్ చేసిన హాట్ స్టార్ కు ప్రస్తుతం టైం ఏం బాగలేదు. హాట్ స్టార్ కు వరుసగా ఎదురుదెబ్బలు తగులున్నాయి. 2022 లో హాట్ స్టార్ కి ఐపీఎల్ ప్రసార హక్కులు పోయాయి. ఈ ఏడాది ఐపీఎల్ హక్కులను జియో సొంతం చేసుకుంది. దీని కారణంగా అక్టోబర్ – డిసెంబర్ నెల్లలోనే 3.8 మిలియన్ సబ్స్క్రైబర్స్ ని హాట్ స్టార్ కోల్పోయింది. ఇది హాట్ స్టార్ చరిత్రలోనే పెద్ద నష్టంగా మిగిలింది.

తాజాగా హాట్ స్టార్ కు మరో చేదు వార్త అందింది. ఇప్పటి వరకు HBO తో ఉన్న ఒప్పందం ముగిసిపోయింది. ఈ ఒప్పందం ముగియడంతో హాట్ స్టార్ లో ఉన్న HBO షోలు, సినిమాలు మార్చి 31 నుంచి కనిపించవు. ఈ విషయాన్ని హాట్ స్టార్ స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఇది హాట్ స్టార్ సబ్ స్క్రైబర్స్ కు నిరాశనిచ్చే వార్త అని చెప్పొచ్చు. అలాగేే హాట్ స్టార్ కు యాజమాన్యానికి కూడా పెద్ధ షాక్. దీని వల్ల హాట్ స్టార్ ఇంకా ఎక్కువ సంఖ్యలో సబ్స్క్రైబర్స్ ని కోల్పోయే అవకాశం వుంది.

- Advertisement -

ఓటీటీ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న హాట్ స్టార్ కు వరుసగా నష్టం కలిగించే చర్యలు జరగడం వల్ల దాని స్థానం మరింత పడిపోయే అవకాశం ఉంది. మరి హాట్ స్టార్ ఈ సవాళ్లును ఎదుర్కొని ముందుకు సాగుతుందా ? ప్రేక్షకులను ఆకర్షిస్తుందా ? అని తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు