కోలీవుడ్ నటుడు సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సూర్య ఏ సినిమాలో నటించినా సూర్య క్రేజే వేరు. సూర్యకి తెలుగు, తమిళంలో మంచి మార్కెట్ ఉంది. ముఖ్యంగా సూర్య నటించిన గజిని సినిమాతో తెలుగు ప్రేక్షకులు పెరిగిపోయారు. తమిళంలో నటించిన ప్రతీ చిత్రం కూడా తెలుగులో విడుదలై మంచి కలెక్షన్లను వసూలు చేస్తుంది.
గత కొంత కాలంగా సూర్య సరైన విజయాలను అందుకోవడం లేదు. కరోనా సమయంలో వచ్చిన ఆకాశం నీ హద్దురా, జై భీమ్ మంచి టాక్‌కే తెచ్చుకున్నప్పటికీ ఆ సినిమాలు థియేటర్‌లో విడుదల కాకుండా ఓటీటీలో విడుదలయ్యాయి. ఈటీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయినప్పటికీ సూర్యకి మాత్రం క్రేజ్ తగ్గలేదనే చెప్పవచ్చు. తాజాగా సూర్యకి సంబంధించిన కొత్త సినిమాను ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ధరకు వెచ్చించి కొనుగోలు చేసినట్టు టాక్ వినిపిస్తోంది.
Read More: The Family Man :ఇంకెంత కాలం ?
శివ దర్శకత్వంలో సూర్య ఒక చిత్రంలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. ఇటీవలే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ డీల్ పూర్తయిందట. ఓ ప్రముఖ ఓటీటీ రూ.100 కోట్లకు ఓటీటీ రైట్స్ కొనుగోలు చేసినట్టు సమాచారం. వరుస విజయాలు దక్కకపోయినా కోలీవుడ్‌లో సూర్య క్రేజ్ బాగుందనే ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు వెట్రిమారన్ దర్శకత్వంలో సూర్య ఓ సినిమాలో నటిస్తున్నారు. మొత్తానికి సూర్య-శివ చిత్రంపై మంచి హైప్ ఉందని చెప్పడానికి ఓటీటీ బిజినెస్ మంచి ఉదాహరణ అని చెప్పవచ్చు.
Read More: Highway Trailer : క్రైమ్ థ్రిల్లర్ లో కొత్తగా..
టాలీవుడ్ లో ఈ వారం థియేటర్లలో కంటే ఓటిటి...
ప్రముఖ హీరోయిన్ అవికా గోర్ గురించి ప్రత్యేకంగా...
నట సింహం నందమూరి బాలకృష్ణకు ఉన్న...
అన్ స్టాపబుల్ ఈ షో గురించి ప్రత్యేకంగా...
టాలీవుడ్ లో దసరా తర్వాత సినిమాల సీజన్...