Bigg Boss Season 6 : ఎంటర్ టైన్ మెంట్ కి అడ్డా ఫిక్స్

టీవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న షో బిగ్ బాస్ సీజన్ 6. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న బిగ్ బాస్, తెలుగులో 2017 నుంచి ప్రారంభమైంది. మొదటి రెండు సీజన్ లకు ఎన్టీఆర్ హోస్ట్ గా చేశాడు. మధ్యలో నేచురల్ స్టార్ నాని వచ్చాడు. ప్రస్తుతం కింగ్ నాగార్జున వరుస సీజన్ లకు హోస్ట్ గా వ్యవహిరిస్తున్నాడు. ఇప్పటికే 5 సీజన్ లను బిగ్ బాస్ పూర్తి చేసుకుంది. అలాగే ఇటీవల బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో 24 గంటలు ప్రసారమయ్యే ఓటీటీ షోను కూడా తీసుకువచ్చారు.

కాగా, ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 కు నిర్వహకులు సర్వం సిద్ధం చేశారు. ఇటీవలే లుక్ ను రివీల్ చేస్తూ ఒక వీడియోను వదిలారు. తాజాగా నిర్వహకులు ఒక ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో పెళ్లి మండపంలో అప్పగింతల సమయంలో అమ్మాయిని వదిలి తల్లిదండ్రులు, బంధువులు అందరూ వెళ్లిపోతారు. ఈ సీన్ ను చూపిస్తూ “అప్పగింతలు అయ్యే వరకు కూడా అగలేక పోయారంటే.. అక్కడ ఆట మొదలైనట్టే“ అంటూ నాగ్ చెప్పే డైలాగ్ తో బిగ్ బాస్ సీజన్ 6 రెడీ అయిందని తెలుసిపోతుంది. “లైఫ్ లో ఏ మూమెంట్ అయినా.. బిగ్ బాస్ తర్వాతే. బిగ్ బాస్ సీజన్ సిక్స్.. ఎంటర్ టైన్ మెంట్ కి అడ్డా ఫిక్స్” అని చెబుతూ ఈ సీజన్ పై ఆసక్తిని పెంచుతున్నారు.

ఇదిలా ఉండగా, బిగ్ బాస్ గురించి ఇప్పటికే పలు వార్తలు బయట చక్కర్లు కొడుతున్నాయి. ఈ సారి కంటెస్టెంట్స్ సంఖ్య తక్కువ ఉంటుందట. కానీ, వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చే వారి సంఖ్య ఎక్కువ ఉండే ఛాన్స్ ఉందని సమాచారం. గత సీజన్ల కంటే, ఈ సారి ఇంట్రెస్టింగ్ షో ఉంటుందని టాక్. కాగా ఈ షో సెప్టెంబర్ మొదటి వారంలో స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. కాగా, ఈ సారి ఓటీటీలో 24 గంటలు ప్రసారం చేస్తారని, టీవీలో ప్రతి రోజు ఒక గంటను టెలికాస్ట్ చేస్తారని ప్రచారం సాగుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు