NBK107 : సంక్రాంతి కంటే ముందే

అఖండ, నందమూరి బాలయ్య సినీ కెరీర్ లో ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. కరోనా మహమ్మారి ఉన్నా, టికెట్ల ధరలు తక్కువగా ఉన్నా బాక్సాఫీస్ వద్ద అఖండ విజయాన్ని నమోదు చేశాడు బాలయ్య. ఈ సినిమా ఇంతలా హిట్ కావడానికి కారణం, బాలయ్యకు సరిపోయే మాస్ ఎలివేషన్స్ పుష్కలంగా ఉండటమే అని చెప్పొచ్చు.

ఈ సినిమా తర్వాత బాలయ్య మాస్ ఎలివేషన్స్ ఎక్కువ ఉన్న సినిమాలకే ప్రాాధాన్యత ఇస్తున్నాడు. స్టోరీలు వినిపించడానికి డైరెక్టర్లు వస్తే, మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే సీన్స్ స్క్రీప్ట్ లో ఉండాలని సూచిస్తున్నాడు. ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య NBK107 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మాస్ ఎలివేషన్స్ ఉండాలని డైరెక్టర్ తో బాలయ్య చెప్పాడట.

దీంతో గోపిచంద్ అనుకున్న స్క్రిప్ట్ లో పలు మార్పులు చూసి, ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడట. ఈ సినిమా ఇప్పటి వరకు వచ్చిన టీజర్, లుక్స్ తో బాలయ్య మాస్ పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. బాలయ్య మాస్ ఫ్యాన్స్ ను సంతృప్తి పరిచేలా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. దీంతో ఈ NBK107 పై అంచనాలు భారీగా ఉన్నాయి. అఖండను టచ్ చేసే స్థాయిలో ఉంటాయని నందమూరి ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

- Advertisement -

నిజానికి గోపిచంద్ యాక్షన్ కామెడీ సినిమాలు చేస్తుంటాడు. కానీ, బాలయ్య సూచనలతో ఈ ప్రయోగం చేయబోతున్నట్టు తెలుస్తుంది.
ఏది ఏమైనా, ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉంచాలని నిర్మాతలు ముందుగా భావించారు. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. డిసెంబర్ తొలి వారం లేదా రెండో వారంలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మైత్రీ మూవీ మేకర్స్ నిర్ణయం తీసుకున్నట్టు టాక్.

NBK107 సంక్రాంతి బరిలో ఉంటే, బాలయ్య, చిరంజీవి(మెగా 154) మధ్య సంక్రాంతి వార్ ఉంటుందని సినీ లవర్స్ అనుకున్నారు. కానీ, ఈ వార్త నిజమే అయితే, సినీ లవర్స్ కోరిక నెరవేరడం కష్టమే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు