టాలీవుడ్ అగ్ర హీరోయిన్లలో ఒకరైన సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా సమంత-నాగచైతన్య దంపతులు విడాకులు తీసుకున్న తరువాత వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే సమంత విడాకుల తరువాత సోషల్ మీడియాను కాస్త తగ్గించిందనే చెప్పాలి. తాజాగా సమంత చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ముఖం చూపించకుండానే సమంత సెల్ఫీ తీసుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది సామ్. ఇక ఆమె ధరించిన టీషర్ట్ పై నీవు ఎప్పటికీ ఒంటరిగా నడవలేవు అని రాసి ఉంది. తన సెల్ఫీ పిక్ పోస్ట్ చేస్తూ.. ‘ఒకవేళ మీరు ఇది వినాల్సి వస్తే మీరెప్పటికీ ఒంటరిగా నడవరు’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. మరోవైపు సమంత టీ షర్టుపై L F C ఉండడంతో నెటిజన్లు సెర్చ్ చేసి లివర్ పుల్ ఫుట్‌బాల్ క్లబ్ టీషర్ట్ ధరించిందని కొందరూ పేర్కొంటున్నారు. సమంత చేసిన ఈ పోస్ట్‌పై పలు చర్చలు జరగడం విశేషం. అసలు సమంత ఏం చెప్పాలనుకుంటుంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Read More: Manushi Chhillar : జక్కనతో ఛాన్స్ కావాలి
ప్రస్తుతం సమంత యశోద, శాకుంతలం సినిమాల్లో నటిస్తోంది. ఈ సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. బాలీవుడ్‌లో కూడా ఎంట్రి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది సమంత. ఇటీవలే తన పెంపుడు కుక్క ఫోటో షేర్ చేసి.. వెనక్కు తగ్గాను.. కానీ ఓడిపోలేదు అని క్యాప్షన్ ఇచ్చి సోషల్ మీడియాలో షేర్ చేసింది. సమంత చేసిన ఈ పోస్ట్ పై దర్శకుడు శివ నిర్వాణ స్పందిస్తూ ఎప్పటికప్పుడు బలంగా ఉండూ అంటూ రిప్లై ఇచ్చాడు. చాలా రోజుల తరువాత సమంత సోషల్ మీడియాలో పోస్టులు చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
Read More: OG: ఇకపై పాన్ ఇండియా రేంజ్ లో పేరు వినిపిస్తుంది
హర్యానా మాజీ ముఖ్యమంత్రి చౌదరి మనవడు,...
‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్...
మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి...
ఒక సినిమాకు డైరెక్టర్… కెప్టెన్ అఫ్ ది...
అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ డైరెక్టర్...