Waltair veerayya: ఓటిటీ ప్లాట్ ఫాం ఫిక్స్

బాబీ దర్శకత్వం లో మెగా స్టార్ చిరంజీవి, మాస్ మహారాజ రవితేజ కలిసి నటించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ కామెడీ సినిమా ”వాల్తేరు వీరయ్య” మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూ. 130 కోట్ల భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా ఈ వాల్తేరు వీరయ్య నేడు విడుదలైంది. మొదటి షో నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. సినిమాలో చాలా రోజుల తర్వాత వింటేజ్ మెగాస్టార్ ను చూశామని ఫ్యాన్స్ అంటున్నారు.

ఈ సినిమాలో వీరితో పాటు శృతి హాసన్, కేథరిన్ ట్రెసా, ఊర్వశి రౌటేలా వంటి స్టార్స్ కూడా నటించాగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమా బాబీ కెరీర్ లో ఓ కీలకమైన భాగం అని చెప్పవచ్చు. మెగా స్టార్ మాస్ మహారాజ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బ్లాక్బస్టర్ గా బాక్స ఆఫీస్ లో మంచి కలెక్షన్స్ తో రికార్డులు సృష్టించనుంది అని అభిమానుల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా వాల్తేరు వీరయ్య ఓటీటీ స్ట్రీమింగ్ పార్టనర్ గురించి ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. సినిమా ప్రారంభంలో వచ్చే క్రెడిట్స్ లో నెట్ ఫ్లిక్స్ తమ స్ట్రీమింగ్ పార్టనర్ అని అధికారికంగా ప్రకటించారు. కాగా థియేటర్స్ లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్న ఈ సినిమాకు ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -

అయితే ఈ చిత్రం ఎప్పటి నుంచి ప్రసారం అవుతుందో తేదీ మాత్రం తెలియాల్సి ఉంది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

 

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు