Meenakshi Chaudhary: హిట్2 బ్యూటీ ఎట్టకేలకు ఛాన్స్..

బాక్సాఫీస్ 2022 సంవత్సరాన్ని హిట్2 అనే మూవీతో సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. వరుస విజయాలతో ఉన్న హీరో అడివి శేష్ కు హిట్2 మరింత బూస్ట్ ఇచ్చింది. అలాగే ఖలాడి సినిమాతో నిరాశ చెందిన హీరోయిన్ మీనాక్షి చౌదరికి ఈ మూవీ కొత్త ఉత్సహాన్ని ఇచ్చింది. ఈ సినిమా తర్వాత మీనాక్షి చౌదరికి వరుసగా అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు.

అలా కోలీవుడ్ లో కొలై అనే డిటెక్టివ్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ కొలై మూవీలో మీనాక్షితో పాటు విజయ్ ఆంటోని, రితికా సింగ్, రాధిక శరత్ కుమార్ కీలక పాత్రలు చేస్తున్నారు. అయితే మీనాక్షికి మళ్లీ తెలుగులో అవకాశం రావడం లేదని ఆమె అభిమానులు ఇప్పటి వరకు నిరాశపడ్డారు. అయితే తాజాగా మీనాక్షి అభిమానులకు గుడ్ న్యూస్ అందింది.

మీనాక్షి మరో తెలుగు సినిమాకు సైన్ చేసింది. సైన్ మాత్రమే కాదు.. ఆ సినిమా నేడు VS10 అనే వర్కింగ్ టైటిల్ తో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సినిమాలో హీరో ఎవరో కాదు.. దాస్ క ధమ్కీ అంటూ ఫుల్ జోష్ లో ఉన్న యంగ్ హీరో విశ్వక్ సేన్. అలాగే రవి అనే కొత్త డైరెక్టర్ ఈ మూవిని తెరకెక్కిస్తున్నాడు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు