Ginna : లిరిక‌ల్ సాంగ్‌

మంచు విష్ణు ఈ మ‌ధ్య‌కాలంలో సినిమాలు త‌గ్గించిన విష‌యం తెలిసిందే. చాలా రోజుల త‌రువాత జిన్నా సినిమాలో న‌టిస్తున్నాడు. ఇందులో స‌న్నీలియోన్‌, పాయ‌ల్ రాజ్‌పుత్ న‌టిస్తున్నారు. నూత‌న ద‌ర్శ‌కుడు సూర్య ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. తాజాగా ‘జిన్నా’ సినిమా నుంచి లిరిక‌ల్ సాంగ్‌ను విడుద‌ల చేశారు.

నా పేరు జిన్నారా.. అంద‌రికీ అన్న‌రా.. న‌క‌ర‌ల్ జేస్తే కిస్సా ఖ‌ల్లాసురా.. అంటూ ఈ పాట కొన‌సాగుతుంది. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి ప్రేమ్ సాహిత్యాన్ని అందించ‌గా పృథ్వీచంద్ర పాడాడు. ఈ సినిమాను తొలుత అక్టోబ‌ర్ 5న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ఒక హింట్ ఇచ్చిన మంచు విష్ణు కొన్ని కార‌ణాల వ‌ల్ల వాయిదా వేశారు. ఇటీవ‌లే విడుద‌ల చేసిన ఈ సినిమా టీజ‌ర్ అద్భుతంగా ఉంది.

టీజ‌ర్ కి 1.9మిలియ‌న్ కి పైగా వ్యూస్ రావ‌డం విశేషం. ఈ చిత్రానికి జి.నాగేశ్వ‌ర‌రెడ్డి క‌థ‌ను అందించారు. కోన వెంక‌ట్ స్క్రీన్ ప్లే, సంభాష‌ణ‌లు అందిస్తున్నారు. జిన్నా సినిమాలో ఒక పాట‌ను విష్ణు కుమార్తెలు అరియానా, వినియానా పాడార‌ట‌. ఈ పాట‌కు భాస్క‌ర్ బ‌ట్ల సాహిత్యం అందించారు. ఈ సినిమాకి ఈ పాట చాలా కీల‌కం కానుంద‌ట‌. అక్టోబ‌ర్ 21న విడుద‌ల‌వ్వ‌నున్న ఈ సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు