Vinaro Bhagyamu Vishnu Katha: ఆడియో లాంచ్ డేట్ ఫిక్స్

టాలవుడ్ యంగ్ హీరో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. నేను మీకు బాగా కావాల్సినవాడిని అనే చిత్రంతో ఇటీవల కిరణ్ అబ్బవరం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో థియేటర్ లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. యాక్షన్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా విభిన్న కాన్సెప్ట్ తో రాబోతుంది.
GA2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అలాగే ఈ సినిమాలో మురళీ శర్మ, ఆమని, ప్రవీణ్, ఎల్‌బి శ్రీరామ్ తో పాటు పలువరు ప్రముఖ పాత్రలు పోషించారు. చైతన్ భరద్వాజ్ సంగీత దర్శకుడు కాగా, డేనియల్ విశ్వాస్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.
అయితే ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరంకు జోడీ కాశ్మీరా పరదేశి నటిస్తుంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఈ నెల 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్, సాంగ్స్ అంచనాలను పెంచుతున్నాయి. కాగా ప్రస్తుతం ఈ చిత్రం ఆడియో రిలీజ్ ఈవెంట్ కు సిద్ధమవుతుంది.
ఈ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో జరగనుందని తాజాగా మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఫిబ్రవరి 12వ తేదీన సాయంత్రం 4 గంటలకు ఈవెంట్ ఉంటుందని ప్రకటించారు. అయితే ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ఎవరు వస్తారు అనేది మాత్రం నిర్మాతలు ప్రకటించలేదు.

For More Updates : 

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు