Vijay devarakonda : ఇదేం దిక్కుమాలిన డిమాండ్ అభిషేక్ పిక్చర్స్ – మరీ రావణాసుర సినిమా సంగతేంటి ?

Vijay devarakonda

ఒక మంచి పని చేయడానికి ఒక మనిషి ముందుకు రావడమే పాపం అయ్యింది ఈ కాలంలో..ఎక్కడలేని నెగిటివిటీ తీసుకొచ్చి ఆ మనిషి మీద వేసి కిందకు లాగాలని చూస్తారు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి సినిమా ఇటీవలనే రిలీజై, ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ ను అందుకుంటుంది.

సూపర్ హిట్ సినిమాల నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీస్ బ్యానర్ నుంచి వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ ఒకటిన విడుదలై.. వరుస ఫ్లాప్ లతో ఉన్న విజయ్ దేవరకొండ కు చాలా రోజుల తరువాత ఒక మంచి విజయాన్ని ఈ ఖుషి సినిమా అందించింది.

గతేడాది వచ్చిన లైగర్ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్న విజయ్ మళ్ళీ యాక్షన్ సినిమాతో కాకుండా ఖుషి లాంటి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఈ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్శింపబడుతూ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.

- Advertisement -

దాంతో ఇటీవలనే మైత్రి మూవీ మేకర్స్ ఖుషి సినిమా సక్సెస్ మీట్ ను వైజాగ్ లో నిర్వహించింది. ఇక ఈ ఈవెంట్ విజయ్ దేవరకొండ ఖుషి సినిమా హిట్ అయినందుకు గాను చాలా ఎమోషనల్ అయ్యాడు. తనకు ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు. ఇక నుంచి ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకొని మంచి సినిమాలు చేస్తానని ప్రామిస్ కూడా చేసాడు. అలాగే ఖుషి సినిమాను ఇంత పెద్ద హిట్ చేసినందుకు గాను విజయ్ దేవరకొండ కృతజ్ఞతగా తన అభిమానుల్లో ఒక వంద మంది కుటుంబాలకు గాను ఒక్కో కుటుంబానికి ఒక్కో లక్ష రూపాయలు( మొత్తం కోటి రూపాయలు ) ఇస్తానని..ప్రామిస్ కూడా చేసాడు.

అయితే విజయ్ దేవరకొండ తన ఫ్యాన్స్ ను కుటుంబంలాగా భావించి.. ఇలాంటి ఒక మంచి పని చేయడాన్ని సర్వత్రా ప్రశంసించారు. కానీ విజయ్ దేవరకొండ గత చిత్రమైన వరల్డ్ ఫెమస్ లవర్ సినిమా డిస్టిబ్యూటర్ రైట్స్ తీసుకున్న అభిషేక్ పిక్చర్స్ మాత్రం విజయ్ వ్యాఖ్యలకు నెగిటివ్ గా రియాక్ట్ అయింది.

తాను కూడా విజయ్ సినిమా వాళ్ళ 8 కోట్ల వరకు నష్టపోయామని వాళ్ళను కూడా విజయ్ దేవరకొండ ఆదుకోవాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక దాంతో విజయ్ అభిమానులు మరియు ఇండస్ట్రీ పెద్దలు అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా పై ఫైర్ అయ్యారు. ఇదేం దిక్కుమాలిన డిమాండ్, సినిమా హిట్టై లాభాలు వస్తే మీరు పంచుకుంటారు ఫ్లాప్ అయితే మాత్రం నష్టాలూహీరో ఇవ్వాలా అని అభిషేక్ పిక్చర్స్ పై విరుచుకు పడుతున్నారు. ఇటీవలనే ఈ ప్రొడక్షన్ నుంచి వచ్చిన రావణాసుర సినిమా డిజాస్టర్ గా నిలిచింది మరీ రావణాసుర సినిమా చూసి నష్టపోయిన ప్రేక్షకులకు ప్రొడ్యూసర్ అభిషేక్ నామా డబ్బులు తిరిగి ఇస్తాడా అంటూ కామెంట్ చేస్తున్నారు.

Check out Filmify for the latest Celebrities gossips, today’s Hollywood news, the latest images of actors & actresses, new movie updates, and ratings & reviews, and the latest entertainment news from all Film Industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు