Varisu: ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ ?

ఇళయతలపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి తీస్తున్న లేటెస్ట్ మూవీ వరిసు. తెలుగులో వారసుడు పేరుతో రిలీజ్ కానున్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తుండగా, ఎస్.తమన్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీపై విజయ్ ఫ్యాన్స్ తో పాటు తెలుగు, తమిళ ఆడియన్స్ అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. వారసుడు సినిమా ప్రమోషన్లను చిత్ర బృందం స్టార్ట్ చేసింది.

ఈ మూవీని వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా జనవరి 12 తేదీన విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని పోస్టర్లను మరియు రెండు పాటలను విడుదల చేసింది. వీటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే, ఈ మూవీ యూనిట్ ఈ సినిమా కోసం భారీ ఈవెంట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ మూవీ యూనిట్ తమిళ్ లో భారీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ యూనిట్ డిసెంబర్ 24వ తేదీన నెవర్ బిఫోర్ రేంజ్ లో ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఫంక్షన్ నిర్వహించడానికి సన్నాహాలను మొదలుపెట్టినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. దీనిపై త్వరలోనే ప్రకటన రానుందట.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు