Tollywood : ఈ నెలలో రాబోయే సినిమాలు

గత కొద్ది రోజులుగా సినిమాలన్నీ వరుస పెట్టి విడుదలవుతున్నాయి. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అన్ని సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. కొన్ని సినిమా విడుదలై ఆశించినంత స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. మరికొన్ని ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయి బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి. తాజాగా సెప్టెంబర్ నెలలోనూ మరిన్ని సినిమాలు విడుదల కాబోతున్నాయి. అవి ఇప్పుడు చూద్ధం.

వైష్ణవ్ తేజ్ – కేతికా శర్మ జంటగా నటించిన రంగ రంగ వైభవంగా చిత్రం సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. జాతి రత్నాలు దర్శకుడు అనుదీప్ అందించిన కథతో తెరకెక్కిన చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసు జంటగా నటించారు. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టం శెట్టి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 2న పేక్షకుల ముందుకు రానుంది.

శర్వానంద్ హీరోగా శ్రీ కార్తిక్ దర్శకత్వంలో రానున్న చిత్రం ఒకే ఒక జీవితం. పెళ్లిచూపులు ఫేమ్ రీతు వర్మ హీరోయిన్ గా అక్కినేని అమల కీలకపాత్రలో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీధర్ గాదే దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన చిత్రం నేను మీకు బాగా కావాల్సిన వాడిని. సంజన ఆనంద్ హీరోయిన్ గా కోడి రామకృష్ణ సమర్పణలో కోడి దివ్య దీప్తి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. యంగ్ హీరోయిన్స్ రెజీనా కసెండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న చిత్రం శాకిని డాకిని. డి సురేష్ బాబు, సునీత తాటి, యోన్ వ్యూ థామస్ కిమ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో ఆది సాయికుమార్ హీరోగా రూపొందుతున్న చిత్రం క్రేజీ ఫెలోస్. దిగంగన సూర్య వంశీ, మీర్నా మీనన్లు ఈ మూవీలో హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ విష్ణు హీరోగా ప్రదీప్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం అల్లూరి. బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 23న విడుదల కానుంది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న చిత్రం పొన్నియన్ సెల్వన్. ఈ సినిమాలో తమిళ్ స్టార్ విక్రమ్, కార్తీ, త్రిష, బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు